Homeఎంటర్టైన్మెంట్Sai Dharam Tej: తేజ్ టాలీవుడ్ ఎంట్రీకి ఏడేళ్లు... అభిమానులను ఉద్దేశిస్తూ ఎమోషనల్​ పోస్ట్​!

Sai Dharam Tej: తేజ్ టాలీవుడ్ ఎంట్రీకి ఏడేళ్లు… అభిమానులను ఉద్దేశిస్తూ ఎమోషనల్​ పోస్ట్​!

Sai Dharam Tej: మెగాస్టార్​ చిరంజీవి మెనల్లుడిగా టాలీవుడ్​లో అడుగుపెట్టి.. అతి తక్కువ కాలంలోనే సుప్రీం హీరోగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సాయిధరమ్​ తేజ్​. నేటితో తేజ్​ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఏడేళ్లు పూర్తవుతోంది. తేజ్​ పిల్లా నువ్వు లేని జీవితం సినమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. నేటితో ఈ సినిమా విడుదలై ఏడేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్​ సోషల్​ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు.

ఇన్నేళ్ల తన ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ట్విట్​ చేశారు తేజ్​. ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలకు సంబంధించి ప్రత్యేక క్లిప్​ను షేర్​ చేసిన తేజ్​.. ఎడేళ్ల క్రితం ఇదే రోజు నా తొలి సినిమాతో మీరు నన్ను హృదయపూర్వకంగా ఓ నటుడిగా స్వీకరించారు. నా ఒడిడొడుకులలో తోడుగా ఉన్నారు. మీ ప్రేమ, మద్దతు నా ఈ ప్రయానాన్ని ఎంతో అద్భుతంగా మార్చాయి. మీ అందరికీ చాలా థ్యాంక్స్.. అంటూ ప్రేక్షకులు అభిమానులను ఉద్దేశిస్తూ పోస్ట్​ చేశారు తేజ్​.

Sai Dharam Tej

కాగా, ఈ ఏడేల్లలో ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘సుప్రీమ్’, ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజు పండగే’ వంటి హిట్‌ చిత్రాలలో నటించారు తేజ్​. చివరగా తేజ్​ రిపబ్లిక్​ సినిమాలో కనిపించారు. ఇందులో తేజ్​ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. కాగా, ఇటీవలే తేజ్​ బైక్​ యాక్సిడెంట్​లో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన తేజ్​.. ప్రస్తుతం బాగానే ఉన్నారు. త్వరలోనే దర్శకుడు మారుతితో కలిసి ఓ సినిమాలో నటించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.

మరోవైపు తేజ్​ తెలుగు సినీ పరిశ్రమలో ఏడేళ్లు పూర్తి చేసిన సందర్భంగా మెగా అభిమానులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో తమ హీరో మరిన్ని విజయాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular