Kotha Lokah : రీసెంట్ సమయం లో బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చి, ఎవ్వరూ ఊహించనంత వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న చిత్రం ‘లోక'(Lokah). తెలుగు లో ఈ చిత్రం ‘కొత్త లోక'(Kotha Lokah) అనే పేరు తో విడుదలై ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. మన సౌత్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు హిట్ అయ్యి చాలా కాలం అయ్యింది. అప్పుడెప్పుడో అనుష్క ‘భాగమతి’ కి భారీ వసూళ్లను చూసాము. ఆ తర్వాత ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చాయి కానీ, అనుకున్నంత గా ఆడలేదు. అలాంటి సమయం లో లేడీ సూపర్ హీరో మూవీ గా వచ్చిన ‘కొత్త లోక’ చిత్రం ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ వసూళ్లను రాబట్టడం సాధారణమైన విషయం కాదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 11 రోజుల్లో 165 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
రాబోయే రోజుల్లో ఈ సినిమా కచ్చితంగా 200 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకోబోతుంది. అయితే ఈ సినిమాని ముందుగా కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) తో చెయ్యాలని అనుకోలేదట. ప్రముఖ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) తో చెయ్యాలని తెగ ప్రయత్నం చేశారట. కానీ శ్రీలీల ఎంత బిజీ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకేసారి నాలుగైదు సినిమాల్లో నటిస్తూ ఉంటుంది ఆమె. అందుకే ఈ చిత్రం లో నటించలేనని చెప్పిందట. ఇక ఆ తర్వాత కళ్యాణి ప్రియదర్శన్ ని సంప్రదించడం, ఆమె వెంటనే ఓకే చెప్పి ఈ సినిమా చేయడం జరిగింది. కళ్యాణి ప్రియదర్శన్ ఒక మంచి నటి. తనకు సరిపడా పాత్ర దొరికితే అదరగొట్టేస్తుంది అని మూవీ లవర్స్ నమ్మకం. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ నేడు ఈ సినిమాలో అద్భుతంగా నటించి ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది.
ఇకపోతే ఈ సినిమాని రిజెక్ట్ చేసిన శ్రీలీల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం. అవకాశాలు అయితే భారీగానే వస్తున్నాయి కానీ, ఆమెకు సక్సెస్ మాత్రం రావడం. కెరీర్ మొత్తం మీద పెళ్లి సందడి, ధమాకా మరియు భగవంత్ కేసరి చిత్రాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి. మిగిలిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఒకవేళ శ్రీలీల ఈ సినిమా ఒప్పుకొని చేసుంటే ఆమె కెరీర్ ఇంకా పెద్ద రేంజ్ కి వెళ్లి ఉండేది. ఈమె డ్యాన్స్ అయితే బాగా చేస్తుంది అనే పేరుంది కానీ, నటన పరంగా మాత్రం చాలా వీక్ గా ఉందనే ట్రోల్స్ ఎప్పటి నుండో ఉన్నాయి. ఈ సినిమాని ఆమె ఒప్పుకొని చేసుంటే ఆ ట్రోల్స్ కి కాస్త చెక్ పడేవి ఏమో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.