Kadali Jaya Sarathi Passes Away: తెలుగు చిత్రసీమలో మరో కన్నీటి విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హస్యనటుడు కడలి జయ సారధి గారికి నేడు ఉదయం స్వర్గస్థులయ్యారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఆయన సినిమారంగ ప్రస్థాన 1960లో సీతారామ కళ్యాణంతో జరిగింది. సారధి గారు ఆ చిత్రంలో నలకూబరునిగా నటించారు. అనేక సినిమాలలో హాస్యపాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందారు. వీరు దాదాపు 372 తెలుగు సినిమాలలో నటించారు. తెలుగు చిత్రపరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాదుకు తరలించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు.

అలాగే, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ సినీకార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారిగా ఉన్నారు. నాటకరంగానికి సేవచేశారు. ఋష్యేంద్రమణి, స్థానం నరసింహారావు, రేలంగి వెంకట్రామయ్య, బి.పద్మనాభం వంటి గొప్ప నటులతో కలిసి నాటకాలలో నటించారు. నందమూరి తారకరామారావు దర్శకత్వంలో వెలువడిన సీతారామ కళ్యాణం సినిమాలో నలకూబరునిగా తొలిసారి చలనచిత్రంలో నటించారు. వీరు నటించిన తెలుగు సినిమాల జాబితా కూడా చాలా పెద్దది.
Also Read: Allu Arjun Remuneration: రెమ్యూనరేషన్ లో అల్లు అర్జున్ నే తోపు.. ఎంతో తెలుసా?
సారధి గారు ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అంతే కాదు సారధి గారు విజయవంతమైన చిత్రాల నిర్మాత కూడా! ధర్మాత్ముడు,అగ్గిరాజు,శ్రీరామచంద్రుడు చిత్రాలను నిర్మించారు. నవతా కృష్ణంరాజు గారు నిర్మించిన జమిందార్ గారి అమ్మాయి, పంతులమ్మ,అమెరికా అమ్మాయి, ఇంటింటి రామాయణం, ఓఇంటి భాగోతం చిత్రాల మ్యూజిక్ సిట్టింగ్స్ అన్ని సారధి గారే చూసారు.

రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి తో ఉన్న సాన్నిహిత్యం తో గోపికృష్ణ బ్యానర్ లో నిర్మించిన చిత్రాలకు సారధి గారు సాంకేతికంగా చూసుకునేవారు. చిత్రపురి కాలనీ నిర్మాణంలో సారధి గారు కీలక పాత్ర పోషించారు. మంచి మనసు ఉన్న సారధి గారు తుదిశ్వాస విడవడం ఆయన సన్నిహితులను తీవ్రంగా కలిచివేసింది.
సారధి గారి మృతి పట్లు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మా ‘ఓకేతెలుగు’ ఛానెల్ తరఫున సారధి గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
Also Read: Telugu Film Producers Stop Shoots: గిల్ట్ నిర్మాతలూ.. అత్త మీద కోపం దుత్త మీద చూపితే ఎలా ?
Recommended Videos



