Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. విజయ్-పూజా హెగ్డే జంటగా నటించిన ‘బీస్ట్’ సినిమా పాటలు ఇప్పటికే యూట్యూబ్‌ను షేక్ చేస్తుండగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. యాక్షన్ ఓ రేంజ్‌లో ఉండటంతో మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. అయితే తమిళ్ వర్షన్ ట్రైలర్ మాత్రమే ప్రస్తుతం విడుదల చేశారు. తెలుగులో థియేట్రికల్ హక్కులను నిర్మాతలు సురేష్‌బాబు, దిల్‌రాజు, సునీల్ నారంగ్ సొంతం చేసుకున్నట్టు టాక్. త్వరలోనే తెలుగు ట్రైలర్ కూడా రానుంది.

ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. థియేటర్‌లో RRR సినిమాలోని ‘కొమురంభీముడో..’ పాట చూసిన తర్వాత దానికి విపరీతమైన క్రేజ్ వస్తోంది. గతేడాది డిసెంబర్ 24న యూట్యూబ్‌లో విడుదలైన ఈ పాటకు సినిమా రిలీజ్ అయ్యే సమయానికి (మార్చి 25) కేవలం 8 మిలియన్ల వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఇప్పుడు 17 మిలియన్ల వ్యూస్ దాటాయి. ఇందులో తారక్ నటనకు ప్రేక్షకులు జేజేలు కొడుతున్నారు. త్వరగా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయాలని కోరుతున్నారు.
Also Read: RRR 9th Day Collections: రాజమౌళి నీరాజనాలతో బాక్సాఫీస్ చిన్నబోయింది

ఇక ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. త్వరలో మాచర్ల నియోజకవర్గం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న హీరో నితిన్ నెక్ట్స్ మూవీని ప్రకటించాడు. తాజాగా నితిన్ 32 వర్కింగ్ టైటిల్‌తో కొత్త మూవీని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ మూవీకి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. హరీశ్ జయరాజ్ మ్యూజిక్ అందించనున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది.

మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ చేస్తున్న రియాల్టీ షో ‘లాకప్’. ఈ షోలోని కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవాలంటే ఓ పెద్ద సీక్రెట్ రివీల్ చేయాల్సి ఉంటుంది. తాజాగా బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే ప్రేక్షకులకు సంచలన ఆఫర్ చేసింది. తనను నామినేషన్స్ నుంచి కాపాడితే లైవ్‌లో టీషర్ట్ విప్పేస్తానని షాకింగ్ కామెంట్స్ చేసింది. మరి ప్రేక్షకులు ఆమెను రక్షిస్తారో లేదో వీకెండ్ లైవ్ షో వరకు వేచి చూడాల్సిందే.

అలాగే మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన ‘ఆచార్య’ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ నెల 29న ఆచార్య సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్ రిలీజ్‌ను త్వరలో విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆచార్య’ మూవీలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు.
Also Read:Balakrishna New Look: వైరల్ : ఓల్డ్ గెటప్ లో హీరో.. పవర్ ఫుల్ గెటప్ లో విలన్