Ram Pothineni Interview: రామ్ ‘ది వారియర్’ ఈ గురువారం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా, రామ్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి రామ్ ఈ ఇంటర్వ్యూలో ఏమి మాట్లాడారో చూద్దాం రండి.
అసలు మీరు పోలీస్ స్టోరీ చేయడానికి కారణం ఏమిటి?
నేను పోలీస్‌గా నటించాలని కథల కోసం వెతుకుతున్నాను. కానీ, నేను విన్న కథలేవీ నన్ను ఆకట్టుకోలేదు. అదే సమయంలో, లింగుస్వామి నా వద్దకు ఈ స్క్రిప్ట్ తీసుకువచ్చాడు. వారియర్ కథలోని యూనిక్ పాయింట్ నాకు బాగా నచ్చింది. అందుకే, వెంటనే ఓకే చెప్పాను.
ఆది పినిశెట్టి ని విలన్ గా ఎంపిక చేయడం వెనుక ఎవరి పాత్ర ఉంది ?
తను ఈ సినిమాలో గురు పాత్రలో నటిస్తున్నాడు. ఆ పాత్ర నాకు బాగా నచ్చింది, ఎవరు నటిస్తారో అని ఎదురు చూశాను. లింగుస్వామి ఆది పేరు చెప్పగానే చాలా సంతోషించాను. కానీ, ఆది సెలెక్టెడ్ సినిమాలే చేస్తున్నాడు తప్ప, విలన్‌గా నటించడానికి అంతగా ఆసక్తి చూపలేదు. అయితే కథ విని ఈ సినిమా చేస్తా అన్నాడు.
Also Read: Tollywood Couples: కలిసున్నారా ? విడిపోయారా ? అయోమయంలో ఉన్న సినిమా జంటలు ఇవే
శింబు బుల్లెట్ సాంగ్ గురించి?
సంగీతం విషయానికి వస్తే నేను సాధారణంగా చొరవ తీసుకోను. ఎందుకంటే ఇది నా విభాగం కాదు. అయితే బుల్లెట్ సాంగ్‌కి శింబు పాడతాడని తెలియగానే చాలా థ్రిల్ అయ్యాను. తమిళంలో ఈ సినిమా సాలిడ్ బజ్ రావడానికి ప్రధాన కారణం ఆయనే.
పోలీసు పాత్ర కోసం మీ ఎలాంటి సన్నాహాలు చేశారు ?
దర్శకుడు లింగుస్వామి కథ చెప్పిన తర్వాత, నేను పోలీసు యూనిఫామ్ ధరించి, ఈ సినిమా కోసం ప్రిపరేషన్ ప్రారంభించాను. చాలా పోలీస్ మూవీస్ కూడా చూశాను.
కృతి శెట్టితో పని చేయడం ఎలా అనిపించింది ?
ఆమె చాలా చిన్నది. కానీ ఆమె చాలా స్థిరమైన నటి. కృతి తన క్రాఫ్ట్‌ని ఎంతగానో ప్రేమిస్తుంది. పాత్రను గౌరవిస్తుంది. అందుకే, ఆమె తన కెరీర్‌లో చాలా స్పీడ్ గా ఎదుగుతుంది. ఈ సినిమాలో తను అద్భుతంగా నటించింది.
బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాలు చేయడం వెనుక కారణం ఏమిటి?
నేను చాలా రొమాంటిక్ సినిమాలు చేశాను. గేర్ మార్చాలనుకుంటున్నాను. ఈ క్రమంలోనే ఇస్మార్ట్ శంకర్ చేశాను. ప్రస్తుతం యాక్షన్ చిత్రాలపైనే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాను. ఐతే, డిఫరెంట్ సబ్జెక్ట్‌లు వస్తే వాటిని కూడా చేస్తాను.
మీ ప్రేమ జీవితం మరియు మీ పెళ్లి గురించి?
ఈ మధ్య నేను నా చిన్ననాటి స్కూల్ మేట్ ని నేను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ వార్త వచ్చింది. ఈ వార్త విని మా ఇంట్లో కూడా నన్ను అనుమానించారు. అయితే ఇవన్నీ పుకార్లే, ఎలాంటి నిజం లేదు.
Also Read:Pakka Commercial Collections: “పక్కా కమర్షియల్” 10 డేస్ కలెక్షన్స్.. ఏమిటి బాక్సాఫీస్ పరిస్థితి ?