OKtelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే..సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై అనుష్క శెట్టి సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘అవకాశాలు ఇస్తామని చెప్పి హీరోయిన్లను లోబర్చుకునే సంస్కృతి తెలుగు పరిశ్రమలో ఉంది. నేను కూడా అలాంటివి చూశాను. ఇది కేవలం తెలుగులోనే కాదు.. ప్రతి ఇండస్ట్రీలో ఉంది. అయితే నేను పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి చాలా సూటిగా.. నిక్కచ్చిగా మాట్లాడుతున్నాను. అందుకే ఇలాంటి పరిస్థితి నాకు ఎదురుకాలేదు’ అని స్వీటీ వివరించింది.

మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ విషయానికి వస్తే.. పవన్ కల్యాణ్‌కు అల్లు అర్జున్ కంటే పెద్ద స్టార్ అని నిరూపించుకునే ఛాన్స్ వచ్చిందని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ‘గ్రేట్.!! భీమ్లా నాయక్ మూవీ హిందీలోనూ రిలీజ్ అవుతోంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ పాన్ ఇండియా స్థాయిలో నిరూపించుకునే అవకాశం వచ్చింది. అతడి సినిమా పుష్ప కంటే పెద్దది అని, తాను అల్లు అర్జున్ కంటే పెద్ద స్టార్ అని నిరూపించుకోవచ్చు’ అని తెలిపాడు.
Also Read: వివాదాస్పద కామెంట్లు, హౌస్ అరెస్టులు.. ఇంకెన్నాళ్లు రేవంత్.. వీటితో ప్రజాదరణ వస్తుందా ..?

మరో అప్ డేట్ ఏమిటంటే.. ఆలియా భట్ నటించిన ‘గంగూబాయి కతియావాడీ’ సినిమాపై గంగూబాయి కొడుకు బాబు రావుజీ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మూవీ కోసం నా తల్లిని వేశ్యగా మార్చారు. ఆమె వేశ్యనా.. సామాజిక కార్యకర్తనా అంటూ చాలామంది అవమానిస్తున్నారు. ఆ మాటలు మమ్మల్ని బాధిస్తున్నాయి. డబ్బు కోసం కుటుంబం పరువు తీస్తున్నారు.

కాగా జీవితాంతం ఆమె సెక్స్ వర్కర్ల అభ్యున్నతికి కృషి చేశారు’ అని వివరించారు. కాగా ఈనెల 25న గంగూబాయి కతియావాడీ విడుదల కానుంది. మరి ఈ సినిమాలో ఆమెను నిజంగానే వేశ్యగా చూపించరా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఈ సినిమా పై భారీ అంచనలున్నాయి.
Also Read: హీరోయిన్ గౌతమి మొదటి భర్త ఎవరో మీకు తెలుసా.. మనందరికీ సుపరిచితుడే..!