Tollywood Trends: టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. అల్లు అర్జున్ మొదటి సినిమా ఏది, అంటే చాలామంది టక్కున గంగోత్రి అంటారు. ఇంకా కాస్త సినిమా పరిజ్ఞానం ఉన్నవారైతే చిరు నటించిన డాడీలో డ్యాన్సర్‌గా చిన్న రోల్ అంటారు. అయితే చిరు నటించిన విజేత సినిమాలోనే అల్లు అర్జున్ బాల నటుడిగా కనిపించాడు.

ఇక కమల్ నటించిన స్వాతి ముత్యంలోనూ బాలనటుడిగా మెరిసాడు. ఇలా చిన్నతనంలోనే దిగ్గజ నటులను దగ్గరగా చూసి నేడు ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడన్నమాట.

మరో అప్ డేట్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో అబ్బాస్-మస్తాన్ ద్వయం అంటే సూపర్ హిట్ చిత్రాలకు పెట్టింది పేరు. ఖిలాడి, బాజీగర్ నుండి రేస్ చిత్రాల వరకు, సూపర్ క్రేజ్ తెచ్చుకున్న దర్శక ద్వయం. బాలీవుడ్‌లో నిన్న జరిగిన RRR సక్సెస్ మీట్‌కి వీరిరువురూ వచ్చారు. RRRలో చరణ్ నటనకే కాదు, బయట చరణ్ సింప్లిసిటీకి కూడా ముగ్థులయ్యారు. ఈక్రమంలోనే చరణ్‌తో ఓ చిత్రం చేయాలనుందని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

అలాగే మరో అప్ డేట్ ఏమిటంటే.. కరోనా కష్టకాలంఓ సామాన్యులకు, పేదలకు సోనూ సూద్ చేసిన సహాయ కార్యక్రమాల గురించి తెలిసిందే. వలస కార్మికుల్ని ఇంటికి చేర్చడం, పలువురికి ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలతో రియల్ హీరో అయ్యాడు.

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థుల కోసం ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం కూడా కల్పించాడు. అందుకే యూఏఈ ప్రభుత్వం సోనూకి గోల్డెన్ వీసాని బహుకరించింది. ఈ గౌరవం దక్కడం ఆషామాషీ కాదు.