https://oktelugu.com/

Julayi: జులాయి లో సోనూసూద్ క్యారెక్టర్ ను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో..?

త్రివిక్రమ్ డైరెక్టర్ గా మారి చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా ఆయన అల్లు అర్జున్ ను హీరోగా పెట్టి చేసిన జులాయి సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఇద్దరి కెరియర్ లలో ది బెస్ట్ సినిమాగా మిగిలిపోయింది.

Written By:
  • Gopi
  • , Updated On : March 8, 2024 / 08:01 AM IST
    Follow us on

    Julayi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రైటర్లకి మంచి గుర్తింపు ఉంది. పింగళి గారి దగ్గర నుండి త్రివిక్రమ్ వరకు ప్రతి ఒక్క రైటర్ కూడా తమదైన రీతిలో పదునైన మాటలతో ప్రేక్షకులను మెప్పిస్తూ, వరుస సక్సెస్ లను సాధిస్తూ వచ్చారు. ఇక ఇలాంటి రైటర్లు కొత్త విధానంలో స్టోరీలను గాని, డైలాగులను గాని అందించడం వల్లే మన సినిమాలు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాయి అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ డైరెక్టర్ గా మారి చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా ఆయన అల్లు అర్జున్ ను హీరోగా పెట్టి చేసిన జులాయి సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఇద్దరి కెరియర్ లలో ది బెస్ట్ సినిమాగా మిగిలిపోయింది. ఇక దీనికి ముందు త్రివిక్రమ్ చేసిన ఖలేజా సినిమా భారీ డిజాస్టర్ అయింది. అయినప్పటికీ త్రివిక్రమ్ మీద మంచి అంచనాలు ఉండడం వల్ల ఈ సినిమా కూడా భారీ హైప్ తో రిలీజ్ అయి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది.

    ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో సోనూసూద్ విలన్ గా నటించాడు. అయితే మొదట విలన్ పాత్ర కోసం సోనుసూద్ ని కాకుండా తెలుగులో మంచి హీరోగా గుర్తింపు పొందిన అక్కినేని సుమంత్ ని ఈ సినిమాలో విలన్ గా తీసుకోవాలని త్రివిక్రమ్ ప్లాన్ చేశారట. కానీ సుమంత్ అప్పటికి కొన్ని సినిమాల్లో హీరోగా చేస్తూ ఉండటం వల్ల మళ్ళీ విలన్ గా చేస్తే ఆయన కెరియర్ కి ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో అనే ఉద్దేశ్యం తోనే ఆ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేశాడట.

    ఇక దాంతో ఆ క్యారెక్టర్ లో సోనుసూద్ ని తీసుకొని ఆయన చేత ఆ క్యారెక్టర్ చేయించి సినిమాను సక్సెస్ చేశారు. ఇక మొత్తానికైతే సోను సూద్ కి ఈ సినిమా ఇచ్చిన గుర్తింపుతో ఆయన తెలుగులో వరుసగా చాలా సినిమాలను చేస్తు మంచి పేరు సంపాదించుకున్నాడు…