https://oktelugu.com/

Star Anchor Divorce: విడాకులు తీసుకోవడం చాలా తెలికైనా విషయం.. కానీ..!

Star Anchor Divorce: తన చలాకి మాటలతో ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ఇస్తూ సుమారు రెండు దశాబ్దాల కాలం నుండి స్టార్ యాంకర్ గా కొనసాగుతున్నారు సుమా కనకాల గారు..ఇన్ని సంవత్సరాలలో ఎంతో మంది యాంకర్లు వచ్చారు మధ్యలోనే వెళ్లిపోయారు కానీ..సుమ కనకాల స్థానం మాత్రం ఇప్పటికి సుస్థిరంగానే ఉంది..ఏ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ అయినా సుమా గారు యాంకర్ గా ఉండడం సర్వసాధారణం అయ్యిపోయింది..ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆర్టిస్టు ఎంతో కాలం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 27, 2022 / 06:33 PM IST
    Follow us on

    Star Anchor Divorce: తన చలాకి మాటలతో ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ఇస్తూ సుమారు రెండు దశాబ్దాల కాలం నుండి స్టార్ యాంకర్ గా కొనసాగుతున్నారు సుమా కనకాల గారు..ఇన్ని సంవత్సరాలలో ఎంతో మంది యాంకర్లు వచ్చారు మధ్యలోనే వెళ్లిపోయారు కానీ..సుమ కనకాల స్థానం మాత్రం ఇప్పటికి సుస్థిరంగానే ఉంది..ఏ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ అయినా సుమా గారు యాంకర్ గా ఉండడం సర్వసాధారణం అయ్యిపోయింది..ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆర్టిస్టు ఎంతో కాలం నుండి ఇండస్ట్రీ లో కొనసాగుతున్న తన భర్త రాజీవ్ కనకాల కంటే కూడా సుమా కి ఎక్కువ పాపులారిటీ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..ఈ విషయాన్నీ స్వయంగా రాజీవ్ కనకాల గారే ఒక్క ఇంటర్వ్యూ లో చెప్పాడు..కొంతమంది సుమ అభిమానులు నేను ఆమె భర్త ని కాబట్టే నాతో ఫోటోలు దిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు.

    Star Anchor Divorce

    రాజీవ్ కనకాల ని సుమ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మన అందరికి తెలిసిందే..అయితే గత కొంత కాలం క్రితం సోషల్ మీడియా లో సుమ కి మరియు రాజీవ్ కనకాల కి మధ్య గొడవలు జరిగాయి అని , త్వరలోనే వీళ్లిద్దరు విడిపోనున్నారు అని ఇలా రకరకాల పుకార్లు షికార్లు చేసాయి..దీని పై ఇటీవల ఈటీవీ లో ప్రసారం అయ్యే అలీతో జాలిగా ప్రోగ్రాం లో అలీ ప్రస్తావించగా దానికి సుమ స్పందిస్తూ ‘నాకు రాజీవ్ కనకాల గారికి మధ్య గొడవ జరిగిన విషయం వాస్తవమే..23 ఏళ్ళ దాంపత్య జీవితం మాది..ఈ 23 ఏళ్ళ కాలం లో మా మధ్య జరిగిన గొడవలకు లెక్కే లేదు..భార్య భర్తలుగా మేము విడిపోవడం చాలా తేలికైనపని..కానీ ఇద్దరు బిడ్డలకు తల్లితండ్రులుగా విడిపోగలమా..దాంపత్య జీవితం లో గొడవలు అనేది సర్వసాధారణం..మన అమ్మ నాన్న లతో గొడవ పడ్డాము కదా అని వాళ్ళని వదిలేయగలమా?? లేదు కదా!..ఇది కూడా అంతే ‘ అంటూ చెప్పుకొచ్చారు సుమ గారు..ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో వైరల్ గా మారింది.

    Also Read: షాకింగ్.. ఉదయకిరణ్ చనిపోయ్యే చివరి క్షణం ముందు ఆ ముగ్గురు డైరెక్టర్స్ తో ఏమి మాట్లాడాడో తెలుసా??

    ఇది ఇలా ఉండగా ఇంతకాలం బుల్లితెర కి మాత్రమే పరిమితం అయినా సుమ గారు ఇప్పటి వరుకు సినిమాల్లో మాత్రం పెద్దగా నటించలేదు..ఆమె కామెడీ టైమింగ్ కి, హుషారు తనం కి మెచ్చి ఎంతోమంది డైరెక్టర్లు ఆమెని తమ సినిమాల్లో నటించని ఆఫర్స్ ఇచ్చినా, ఎందుకో ఆమె సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపలేదు..అప్పట్లో రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం తో మళ్ళీ ఆమె సినిమాల వైపు చూడలేదు..అయితే ఇప్పుడు ఆమె చాలా కాలం తర్వాత వెండితెర మీద ‘జయమ్మ పంచాయితీ ‘ అనే సినిమాలో ప్రధాన పాత్ర ద్వారా మనల్ని అలరించేందుకు సిద్ధం అయ్యింది..ఇటీవలే ఈ సినిమా టీజర్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..మే 6 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ద్వారా సుమ ప్రేక్షకులను ఎలా అలరించబోతుందో చూడాలి.

    Also Read: ఆదిపురుష్ మూవీ పై KTR వివాదాస్పద వ్యాఖ్యలు

    Recommended Videos:

    Tags