https://oktelugu.com/

RaviTeja Birthday Special : రవితేజ నుంచి ఆరు సినిమాల సర్ ప్రైజ్ లు !

RaviTeja Birthday Special : ఈ నెల 26వ తేదీన మాస్ మహారాజా రవితేజ  పుట్టిన రోజు.   కాగా  రవితేజ పుట్టినరోజు సందర్భంగా..  ఆ రోజు ఉదయం రవితేజ కొత్త సినిమాల అప్ డేట్స్ రానున్నాయి.  ముఖ్యంగా   రవితేజ పుట్టిన రోజు నాడు   మొత్తం  6 సినిమాల అప్డేట్స్  ఉండబోతున్నాయని  తెలుస్తోంది.  మొదట   రవితేజ హీరోగా   రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ‘ఖిలాడీ’ మూవీ గురించి చిత్ర యూనిట్ తాజాగా ఓ అప్‌ డేట్‌ ను విడుదల చేసింది.   ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 23, 2022 / 10:17 PM IST
    Follow us on

    RaviTeja Birthday Special : ఈ నెల 26వ తేదీన మాస్ మహారాజా రవితేజ  పుట్టిన రోజు.   కాగా  రవితేజ పుట్టినరోజు సందర్భంగా..  ఆ రోజు ఉదయం రవితేజ కొత్త సినిమాల అప్ డేట్స్ రానున్నాయి.  ముఖ్యంగా   రవితేజ పుట్టిన రోజు నాడు   మొత్తం  6 సినిమాల అప్డేట్స్  ఉండబోతున్నాయని  తెలుస్తోంది.  మొదట   రవితేజ హీరోగా   రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ‘ఖిలాడీ’ మూవీ గురించి చిత్ర యూనిట్ తాజాగా ఓ అప్‌ డేట్‌ ను విడుదల చేసింది.   ఈ నెల 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా.. ఆ రోజు ఉదయం 10.08 గంటలకు ‘ఫుల్ కిక్కు’ అంటూ సాగే పాటను రిలీజ్ చేస్తామని ప్రకటించింది. 

    అలాగే,    ఫిబ్రవరి 11న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ మరోసారి క్లారిటీ ఇచ్చింది.  ‘ఖిలాడీ’ నుంచి కీలక అప్‌ డేట్  వస్తే..  రవితేజ హీరోగా వస్తున్న మరో  సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’ నుంచి టీజర్ రానుంది అట. ఈ  టీజర్ ను ఇప్పటికే కట్ చేసారని, చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది.   అలాగే రవితేజ ప్రస్తుతం చేస్తున్న  మరో సినిమా  ‘ధమాకా’ నుంచి ఫస్ట్  గ్లింప్స్  వీడియో  రాబోతుంది.  
     అదే విధంగా  రవితేజ చేస్తున్న ఇంకో  సినిమా ‘రావణాసుర’.   కాగా  ఈ  రావణాసుర నుంచి బర్త్ ​డే పోస్టర్ రానుంది.  అలాగే రవితేజ హీరోగా వస్తున్న  క్రేజీ మూవీ  టైగర్ నాగేశ్వరరావు నుంచి కూడా  ఓ సాంగ్ ను  రిలీజ్ చేయబోతున్నారు.  ఇక  బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమాలో కూడా  రవితేజ  ఓ  కీలక పాత్రలో నటిస్తున్నాడు.  అయితే,  ఈ సినిమాలో రవితేజ నటిస్తున్నట్లు ఓ ప్రకటన రానుంది.
    మొత్తమ్మీద రవితేజ ప్రస్తుతం చేస్తున్న ఆరు సినిమాల నుంచి   భారీ అప్ డేట్స్ రాబోతున్నాయి.  మరి జనవరి 26న  రవితేజ అభిమానులకు ఫుల్ కికే.  పైగా రవితేజ చేస్తున్న ఆరు సినిమాల పై మంచి అంచనాలు ఉన్నాయి.