Tollywood Singer : టాలీవుడ్ లో ప్రతిభ గల సింగర్స్ కి కొదవలేదు. దానికి కారణం పాడుతా తీయగా వంటి రియాలిటీ షోలు అనేక మంది టాలెంటెడ్ సింగర్స్ ని వెలుగులోకి తెచ్చాయి. ఈటీవి, జెమినీ, స్టార్, జీ తెలుగు ఛానల్స్ లో అనేక సింగింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఓటీటీలో సైతం సింగింగ్ రియాలిటీ షోలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో సింగర్స్ టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. సంగీత దర్శకులు యువ సింగర్స్ ని ప్రోత్సహిస్తున్నారు.
బాల సుబ్రహ్మణ్యం వంటి లెజెండరీ సింగర్ స్పూర్తితో గాయకులుగా మారిన వారు ఎందరో ఉన్నారు. వారిలో రమ్య బెహరా ఒకరు. ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, నరసారావు పేటకు చెందిన రమ్య బెహరా టాలీవుడ్ లో స్టార్ సింగర్ గా రాణిస్తుంది. ఈమె 1994లో జన్మించారు. అయితే పెరిగింది మాత్రమే హైదరాబాద్ లోనే. రమ్య బెహరాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు . రామాచారి వద్ద సంగీతం నేర్చుకుంది.
అంతరం వివిధ సింగింగ్ షోలలో పాల్గొంది. ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కంట్లో పడింది. ఆయనను తన గాత్రంతో మెప్పించింది. ఆయన కంపోజ్ చేసిన పలు సాంగ్స్ రమ్య బెహరా పదారు. టాలీవుడ్ కి రమ్య బెహరాను పరిచయం చేసింది కీరవాణినే. లచ్చిందేవికి ఒక లెక్కుంది, బాహుబలి ది బిగినింగ్, టెంపర్, ఒక లైలా కోసం, కృష్ణాష్టమి, బ్రూస్ లీ, ప్రేమకథా చిత్రం, లౌక్యం ఇలా అనేక చిత్రాల్లో సాంగ్స్ పాడింది.
కాగా రమ్య బెహరా టీనేజ్ ఫోటో ఒకటి వైరల్ గా మారింది. అప్పటి లుక్ తో ఇప్పటి ఆమె లుక్ కంపేర్ చేసి జనాలు షాక్ అవుతున్నారు. అప్పుడు రమ్య బెహరా ఇలా ఉండేదా అని వాపోతున్నారు. రమ్య బెహరా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఆమె తరచుగా తన ఫోటోలు వీడియోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. అవి కాస్తా వైరల్ అవుతూ ఉంటాయి.