Dhana Sri : యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళు చేసే సినిమాల్లో గాని, సీరియల్స్ లో గాని తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి క్రమంలోనే బుల్లితెర నటి అయిన ‘సురభి చందన’ కూడా పలు హిందీ సీరియల్స్ లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంది. ఇక ఇది ఇలా ఉంటే సురభి చందన-కరణ్ శర్మ లు ప్రేమించుకున్నారు . ఇక బుల్లితెరపై లవ్ బర్డ్స్ గా పిలవబడే వీళ్ళు దాదాపు 13 సంవత్సరాలు నుంచి ప్రేమించుకుంటున్నారు.
ఇక వీళ్ళ ప్రేమను పెద్దలతో చెప్పి ఒప్పించి జైపూర్ లో ఈ మార్చిలో వీళ్ళు పెళ్లి పీటలు ఎక్కారు. నిజానికి వీళ్ళు చాలా మంచి కపుల్స్ గా కూడా గుర్తింపు పొందుతున్నారు. ఇక ప్రస్తుతం వీళ్లు షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి వెకేశన్ లో ఉన్నారు. ఇక ఈ అమ్మడు తన భర్తతో పాటు ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తీసుకొని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంది. ఇక ఇది చూసిన కొంతమంది సురభి చందన ని ఇండియన్ టీమ్ క్రికెట్ ప్లేయర్ అయిన యజ్వేంద్ర చాహల్ భార్య అయిన ధన శ్రీ అనుకొని ఆమె పైన చాలా బ్యాడ్ కామెంట్స్ కూడా చేశారు. ఇక కొంతమంది అయితే ఈమె ధనశ్రీ నా సారీ చాహెల్ నువ్వు లైఫ్ పార్టనర్ గా ఈమెను ఎంచుకొని చాలా పెద్ద తప్పు చేశావు.
ఎందుకంటే ఆమెకి భర్త మీద రెస్పెక్ట్ లేదు. స్విమ్మింగ్ ఫూల్ లో అలాంటి పనులు చేయడం ఏంటి ఆ పక్కన ఉన్న అతను ఎవరు అంటూ చాలా ఘాటుగా కామెంట్లు అయితే చేశారు. ఇక మరికొందరైతే ఇన్ ఫ్లూ యెన్సర్స్ ని పెళ్లి చేసుకొని చాలా చాలా పెద్ద తప్పు చేశావు అంటూ తన గురించి బ్యాడ్ కామెంట్స్ చేస్తూనే చాహల్ ను ట్యాగ్ చేశాడు… ఇక ఇది చూసిన సురభి చందన అభిమానులు ఆమె చాహల్ భార్య ధన శ్రీ కాదు. బుల్లితెర నటి సురభి చందన అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు.
ఇక ఇప్పటికే సురభి చందన ఇష్క్ బజ్, సంజీవన్, నాగిన్ 5 లాంటి పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది…ఇక కరణ్ శర్మ కూడా ‘యే రిస్త క్యా కేహ్లతా హై’, ‘పవిత్ర రిష్తా’ అనే సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు…