Tollywood Film Strike: తెలుగు సినిమా ఇండస్ట్రీ గత కొద్ది రోజులుగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా సినిమా బడ్జెట్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల సినిమా టికెట్ల రేట్లను కూడా భారీ స్థాయిలో పెంచాల్సిన అవసరం అయితే ఏర్పడింది. దానివల్ల సినిమాను చూడటానికి సగటు ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. ఇక దానికి తోడుగా ఈ మధ్య సినీ కార్మికులు వాళ్లకు వేతనాలు పెంచాలి అంటూ సినిమా ప్రొడ్యూసర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే గత 20 రోజుల నుంచి సినీ కార్మికులు సినిమా షూటింగులన్నింటిని బందు చేసి సమ్మెను నిర్వహిస్తున్నారు. ఇక రీసెంట్ గా చిరంజీవికి సైతం వాళ్ళ బాధను వినిపించారు. చిరంజీవి ప్రొడ్యూసర్లతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రొడ్యూసర్లు అందరూ కలిసి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే దిల్ రాజు తో కలిసి ప్రొడ్యూసర్లు, దర్శకులు అందరూ తెలంగాణ సీఎం అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి అతన్ని కలిశారు.
Also Read: కమల్ హాసన్ ఒక్కసారి కూడా రజినీకాంత్ ను బీట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే..?
సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలను తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీ ఏ పరిస్థితుల్లో ఉంది. దీనిని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీదనే కొన్ని కీలకమైన నిర్ణయాలు చేయాలనే ఉద్దేశ్యంతో వీళ్ళు రేవంత్ రెడ్డిని కలిసినట్టుగా తెలుస్తోంది.
మరి ఇక్కడ ఉండే పరిస్థితులన్నింటిని పూస గుచ్చినట్టుగా అతనికి తెలియజేశారు. మరి ఇలాంటి సందర్భంలోనే రేవంత్ రెడ్డి సైతం వాళ్ల ప్రాబ్లమ్స్ పట్ల పాజిటివ్ గా స్పందించి సినిమా ఇండస్ట్రీలో వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం కూడా వాళ్లకి పూర్తిగా అండగా ఉంటుందని ఒక భరోసా అయితే ఇచ్చాడు…
ఇక ఈ మీటింగ్ లో దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, నాగ వంశీ లాంటి స్టార్ ప్రొడ్యూసర్లు పాల్గొన్నారు. ఇక అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, సందీప్ రెడ్డి వంగ, శ్రీకాంత్ ఓదెల, వంశీ పైడిపల్లి లాంటి స్టార్ డైరెక్టర్లు కూడా హాజరవ్వడం విశేషం…అయితే పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది…అప్పటి నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద చాలా కోపం తో ఉన్న రేవంత్ రెడ్డి కొద్దిరోజుల పాటు కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలకు, ప్రీమియర్ షోలకు సైతం పర్మిషన్స్ అయితే ఇవ్వలేదు…ఇక ఇండస్ట్రీ లో ఉన్న పెద్దలు సీఎం ను కలిసి మాట్లాడాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎట్టకేలకు అది ఇప్పుడు వర్కౌట్ అయింది…అయితే సినిమా ఇండస్ట్రీ లో ఉన్న సినీ కార్మికుల వైపు రేవంత్ రెడ్డి ఉన్నాడు వాళ్ళ డిమాండ్ లను విని వాళ్ళకు వేతనాలను పెంచాలని రేవంత్ రెడ్డి కూడా చెబుతున్నాడట…
కానీ కార్మికుల వేతనాలను పెంచడం వల్ల చిన్న ప్రొడ్యూసర్స్ మీద అదనపు భారం పడుతుందని రేవంత్ రెడ్డి కి వివరంగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు…ఇక ఇదిలా ఉంటే ప్రతి పక్ష పార్టీ లు సైతం ఈ విషం మీద గత కొన్ని రోజుల నుంచి కొన్ని కామెంట్స్ చేస్తున్నాయి…సినీ కార్మికుల్లో చాలా మంది యూసఫ్ గూడ కి చెందిన వారే కావడం వల్లే రేవంత్ రెడ్డి వీళ్ళ మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని చెబుతున్నారు…
ఇక జూబ్లీహిల్స్ ఏం ఎల్ ఏ అయిన మాగంటి గోపీనాథ్ గత కొద్దిరోజుల క్రితం చనిపోవడం తో అక్కడ తొందర్లోనే బై ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి… కాబట్టి యూసఫ్ గూడ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం కిందకే వస్తుంది…అక్కడ 10000 సినీ కార్మికుల ఓట్లు ఉన్నాయి…కాబట్టి వాటిని క్యాచ్ చేసుకోవడానికి ఇదే కరెక్ట్ సమయం అని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడని అందుకే సినీ కార్మికుల బాధలు పట్టించుకుంటున్నాడు అని ప్రతి పక్షాలు దానిని రాజకీయ యాంగిల్ లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి…
Also Read: రామ్ చరణ్ తో నటించడానికి నో చెప్పిన యంగ్ బ్యూటీ..మండిపడుతున్న ఫ్యాన్స్!
ఇక ఇవన్నీ పక్కన పెడితే సినిమా షూటింగ్ లు సక్రమంగా జరగాలి అంటే సినీ కార్మికులు సమ్మె విరమించాల్సిన అవసరం అయితే ఉంది…దీని మీద ప్రొడ్యూసర్లు, దర్శకులు కొన్ని రోజుల నుంచి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నప్పటికి వాళ్ల వల్ల కావడం లేదని అందుకే దీనికి ఒక పరిష్కారం చూపించాలని ఇండస్ట్రీ పెద్దలు అందరూ కలిసి రేవంత్ రెడ్డిని శరణు కోరారు…మరి ఆయన ఈ విషయం మీద ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు అనేది ఇప్పుడు కీలకంగా మారబోతోంది…