Nellore Aruna Arrest: నేరమయ కార్యకలాపాలు చేసి.. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడి.. నెల్లూరు జిల్లాలో శాసించిన చీకటి మహిళ అరుణ వ్యవహారంలో అనేక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో ఆమె పాత్ర బయటకి వచ్చింది. తద్వారా ఈ వ్యవహారం ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. ప్రభుత్వం అరుణను అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆమె విచారణ ఖైదీగా జైల్లో ఉన్నారు.
Also Read: 2015లో అలా.. 2024 లో ఇలా.. లేడీ డాన్ అరుణ షాకింగ్ ఫార్మేషన్?
అరుణను అరెస్టు చేస్తున్నప్పుడు పోలీసులు ఆమె వద్ద నుంచి రెండు ఖరీదైన స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో వందల కొద్ది చిత్రాలు.. ప్రైవేట్ వీడియోలు ఉన్నట్టు తెలుస్తోంది. రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారులు ఆమెతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వీడియోలు కూడా అందులో ఉన్నాయని సమాచారం. సహజంగా తను ఎవరైనా కలిస్తే ఫోటోలు తీసుకోవడం అరుణకు అలవాటు. అంతే కాదు కొంతమంది అధికారులతో అత్యంత సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలు తీసుకోవడం కూడా అలవాటే. ఆ వీడియోలు, ఫోటోలు బయట పెడతానని భయపెట్టి పోలీస్ డిపార్ట్మెంట్తో ఆమె పనులు చేయించుకునేది. ఆమె వలలో చిక్కిన వారిలో ఎస్పీ, ఏ ఎస్ పి, డీఎస్పీ స్థాయి వ్యక్తులు ఉన్నారు. వారి అండ చూసుకునే కిందిస్థాయి ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు కల్పిస్తామని ఆమె ఆశ చూపించింది. శ్రీకాంత్ పెరోల్ విషయంలో కూడా ఆమె ఇదే దందాను అనుసరించినట్టు తెలుస్తోంది.
Also Read: నెల్లూరు డాన్ అరుణ మీద 160 కంప్లైంట్లు.. ప్రతి పోలీస్ స్టేషన్లో ఆమె మనుషులు..
శ్రీకాంత్ పెరోల్ విషయంలో డబ్బు సర్దుబాటుకు సంబంధించి నెల్లూరు జిల్లాలోని గూడూరులో ఉన్న ఓ ప్రైవేట్ విద్యాసంస్థ ముఖ్య అధికారి సహకరించినట్టు సమాచారం. ఇప్పుడు మాత్రమే కాదు గతంలో అనేక సందర్భాలలో ఆమెకు అతడు డబ్బు సర్దుబాటు చేసినట్టు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య కూడా సన్నిహిత సంబంధం ఉన్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు ఫోన్లలో ఉన్న ఫోటోలు.. ఇతర వీడియోల ఆధారంగా అరుణ కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు అంటున్నారు. అయితే ఆమె ఫోన్లను తెరవడానికి కోర్టు అనుమతి తీసుకుంటామని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ఏపీ లో ప్రకంపనలు చోటు చేసుకుంటాయని.. పెద్ద పెద్ద తలకాయల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని ప్రచారం జరుగుతోంది.