https://oktelugu.com/

Tollywood: టాలీవుడ్ లో మ‌రో విషాదం… నిర్మాత నాగేశ్వర రావు మృతి

Tollywood: తెలుగు చిత్ర పరిశ్రమలో మ‌రో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత సంవత్సరాల కాలంగా ఫీల్మ్ ఇండస్ట్రీ చేదు వార్తలు వింటూనే ఉంది. వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది సినీ ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. ఈ పరిణామాలతో తెలుగు ప్రేక్షకులు ఆందోళనకు గురి అవుతున్నారు. తెలుగులో ప‌లు సినిమాల‌ను నిర్మించిన జ‌క్కుల నాగేశ్వ‌రరావు (46) అనే నిర్మాత మృతి చెందాడు. డిసెంబర్ 2వ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 3, 2021 / 08:55 AM IST
    Follow us on

    Tollywood: తెలుగు చిత్ర పరిశ్రమలో మ‌రో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత సంవత్సరాల కాలంగా ఫీల్మ్ ఇండస్ట్రీ చేదు వార్తలు వింటూనే ఉంది. వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది సినీ ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. ఈ పరిణామాలతో తెలుగు ప్రేక్షకులు ఆందోళనకు గురి అవుతున్నారు. తెలుగులో ప‌లు సినిమాల‌ను నిర్మించిన జ‌క్కుల నాగేశ్వ‌రరావు (46) అనే నిర్మాత మృతి చెందాడు. డిసెంబర్ 2వ తేదీన రోడ్డు ప్ర‌మాదంలో నిర్మాత నాగేశ్వ‌ర రావు క‌న్నుమూసినట్లు తెలుస్తుంది.

    నాగేశ్వ‌ర్ రావు కృష్ణా జిల్లా వైపు వెళ్తుండ గా… ఉయ్యూరు మండ‌లం మంటాడ గ్రామం స‌మీపంలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో నాగేశ్వ‌ర రావు అక్క‌డి కక్క‌డే చ‌నిపోయారు అని సమాచారం. నాగేశ్వ‌ర రావుకు భార్య తో పాటు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే నాగేశ్వ‌ర్ రావు మృతి వార్త తెలిసిన సీని ప్ర‌ముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. కాగా నాగేశ్వ‌ర రావు తెలుగులో… ల‌వ్ జ‌ర్నీ, అమ్మా నాన్న ఊరెళితే, వీడు స‌రైనోడు వంటి సినిమాలను నిర్మించాడు. ఈ వార్తతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పలువురు సినీ ప్రముఖులు నాగేశ్వర రావు మృతికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. చాలా తక్కువ వ్యవధిలోనే శివశంకర్ మాస్టర్, లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి, హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు రామాంజులు రెడ్డి మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే.