OK Telugu MovieTime : మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ సమాధి వద్ద తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ శ్రద్ధాంజలి ఘటించాడు. అయితే ఈ విషయంపై కన్నడ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. పునీత్ చనిపోయిన 100 రోజుల తర్వాత కానీ విజయ్‌కు తీరిక దొరకలేదా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏదో పని మీద బెంగళూరుకు వచ్చిన విజయ్ పనిలో పనిగా పునీత్ ఘాట్ వద్దకు వెళ్లారని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. పవన్కల్యాణ్.. ‘భీమ్లా నాయక్’ అదరగొడుతోంది. ప్రేక్షకులందరినీ విపరీతంగా అలరిస్తూ కలెక్షన్లలో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ‘భీమ్లా’.. ఫిబ్రవరి 25న థియేటర్లలోకి వచ్చింది. అలా రిలీజ్ అయినా మూడు రోజుల్లో రూ.100 కోట్లు కలెక్షన్లు క్రాస్ చేసింది. ఈ విషయాన్ని ప్రముఖ సినీ ట్రేడ్ విశ్లేషకుడు మనోబాల ట్వీట్ చేశారు. యూఎస్లోనూ ఈ సినిమా, రెండు మిలియన్ డాలర్ల మార్క్ను అధిగమించింది.
Also Read: ప్రభాస్ ఆదిపురుష్ రిలీజ్ పై నిర్మాత క్లారిటీ

ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో తెరకెక్కిన సెబాస్టియన్ pc-524 ట్రైలర్ వచ్చేసింది. రేచీకటితో నైట్ డ్యూటీ చేసి ఉద్యోగం పోగొట్టుకున్న కానిస్టేబుల్ పాత్రలో కిరణ్ నటన అదిరిపోయింది. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి ఆయువుపట్టులా నిలవనుంది.
కాగా సస్పెండ్ అయిన తర్వాత తన ఉద్యోగం పోవడానికి కారణమైన వారిని హీరో ఎలా పట్టుకున్నాడన్నది ఆశక్తిగా తెరకెక్కించారు. మార్చి 4న ఈ మూవీ రిలీజ్ కానుంది.
Also Read: ఈ వీక్ సినిమాల పరిస్థితేంటి ?