OKTelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజబ్ లీలా భన్సాలీని మీట్ అవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైన భన్సాలీతో బన్నీ కొత్త ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పినట్లు టాక్. దక్షిణాది యోధుని ఆధారంగా భన్సాలీ ఒక పీరియాడిక్ మూవీ ప్లాన్ చేస్తున్నారని, అందులో బన్నీ హీరోగా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. మరీ త్వరలో ఈ కాంబినేషన్‌పై ఏదైనా క్లారిటీ వస్తుందో చూడాలి.
మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏమిటంటే.. CM జగన్ మరో రెండు సార్లు CMగా కొనసాగితే రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుతుందని నటుడు సుమన్ అన్నారు. మూడు దఫాలు CMగా ఒక్కరే ఉండేలా ప్రజలు అవకాశం ఇస్తే అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీలేదని, YSRCP ప్రభుత్వం నవరత్నాల పథకాలతో పేదల్లో చిరునవ్వును నింపిదని అన్నారు. సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు.
Also Read: పునీత్ రాజ్ కుమార్ పేరు మీద రహదారి !
ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో రెండు వారాలు పూర్తవగా ముమైత్ ఖాన్, శ్రీరాపాక ఎలిమినేట్ అయ్యారు. తాజాగా బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోపై ఆసక్తికర కామెంట్లు చేశాడు బిగ్‌బాస్ మాజీ విన్నర్ కౌశల్ మండా. ఈసారి బిగ్‌బాస్ ఓటీటీ సీజన్‌లో బిందుమాధవి గెలుస్తుందన్నారు. కొన్ని ప్రోమోల్లో చూశాక బిందుమాధవి యాటిట్యూడ్ బాగుందన్నారు. రీ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లు తడబడటం చూస్తుంటే నవ్వొస్తోందన్నారు.
ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో దర్శకుడు రాజమౌళి, నిర్వాత డీవీవీ దానయ్య సీఎం వైఎస్ జగన్‌తో భేటి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా మంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. కొత్త జీవో ఇచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపేందుకు వారు వచ్చారన్నారు. కొత్త జీవో ప్రకారం ప్రత్యేక రేట్లు, ఐదో షో నిబంధనల ప్రకారం అందరికీ వర్తించనట్లే ఆర్ఆర్ఆర్ సినిమాకు వర్తిస్తాయన్నారు.
Also Read: ఏపీలో ‘విన్నింగ్’ కాంబినేషన్.. పాత ఫార్మూలానే గానీ.. ఏపీలో సక్సస్ ఫార్మూలా..!