Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ఒకప్పుడు మన మ్యూజిక్ డైరెక్టర్ల హవా ఎక్కువగా కొనసాగేది. మంచి మ్యూజిక్ ని అందిస్తూ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర వహిస్తూ ఉండేవారు. కానీ గత కొద్ది రోజుల నుంచి మన వాళ్ళ హవా తగ్గిపోయిందనే చెప్పాలి. ఇతర భాషల మ్యూజిక్ డైరెక్టర్ల హవానే ఎక్కువగా కొనసాగుతుంది ముఖ్యంగా ఏఆర్ రెహమాన్, అనిరుద్, శ్యామ్ సి ఎస్, సంతోష్ నారాయణన్, అంజనీస్ లోక్ నాథ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాగా వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇంతకుముందు తమన్, దేవిశ్రీప్రసాద్ లాంటి వాళ్ళు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగారు. ఇప్పుడు మాత్రం వాళ్ళ హవా కొంతవరకు తగ్గిపోయింది. ఏ పెద్ద సినిమా చూసినా చిన్న సినిమాలు చూసినా కూడా ఇతర భాషల మ్యూజిక్ డైరెక్టర్ల హవా ఎక్కువగా కొనసాగుతుందనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో మన వాళ్లు వాళ్లకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాల్సిన సందర్భం అయితే ఆసన్నమైంది.
Also Read: ‘కేసరి 2’ మొదటి రోజు వసూళ్లు..పాజిటివ్ టాక్ తో ఇంత తక్కువనా?
ఇక ఇలాంటి సందర్భంలో ఒక రెండు మూడు సినిమాలకు సంబంధించిన ఆల్బమ్స్ అద్భుతంగా ఇస్తే మాత్రం మరోసారి తమన్(Thaman), దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) ఇద్దరూ కూడా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లుగా ఎదిగి వాళ్ల సత్తా చాటుకోవడమే కాకుండా తెలుగు సినిమాలను సైతం ఎక్కువ సంఖ్యలో చేయడానికి అవకాశం ఉంటుంది.
మరి ఇలాంటి సందర్భంలో వాళ్లు చేస్తున్న మ్యూజిక్ తో ప్రేక్షకుల్లో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటారు తద్వారా సినిమాల విషయంలో ఎలాంటి రిజల్ట్ ని పొందుతారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక తమన్ మీద ఎక్కువగా కాపీ మ్యూజిక్ అంటూ వార్తలు రావడం వల్ల ఆయన కొంతవరకు తన కెరీర్ ని కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది.
అలాగే దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) పుష్ప 2(Pushpa 2) సినిమాతో మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్నప్పటికి ఆయన మ్యూజిక్ ని చాలా లేటుగా ఇస్తాడు అనే ఒక రూమర్ అయితే అతని మీద బాగా ఉంది. దాని వల్ల ఆయనకు రావాల్సిన ఛాన్స్ లు రావడం లేదని మరి కొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక మీదట మనవాళ్ళు చేసే సినిమాలతో పూర్వ వైభవం సంపాదించుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది…
Also Read: సక్సెస్ మీట్ లో అబద్దాలు చెప్పిన నందమూరి కళ్యాణ్ రామ్..వీడియో వైరల్!