Tarun In Bigg Boss 6: తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎంతతి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ప్రతి ఏడాది ఈ షో వస్తుందంటే చాలు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరుకు టీవీ లకు అతుక్కుపోతారు..ఇప్పటికే 5 సీసన్స్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పుడు ఆరవ సీజన్లో లోకి అడుగుపెట్టబోతుంది..గడిచిన 5 సీసన్స్ ఒక్కదానిని మించి ఒక్కటి సూపర్ హిట్ అవ్వడం తో 6 వ సీసన్ పై అంచనాలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి..ప్రేక్షకుల్లో పెరిగిన ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈసారి ఈ రియాలిటీ షో ని చాలా గ్రాండ్ గా ఉండేవిధంగా ప్లాన్ చేస్తున్నారు..ఈసారి కంటెస్టెంట్స్ విషయం లో ఎక్కడ కూడా రాజి పడేలా అనిపించడం లేదు..టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న సెలబ్రిటీస్ ని ఈసారి కంటెస్టెంట్స్ గా తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట..గత కొద్దీ రోజుల నుండి వారి పేర్లు సోషల్ మీడియా లో ప్రచారం అవుతూ వస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో క్రేజీ హీరో కూడా చేరిపోయాడు.

Also Read: Naresh Third Wife Ramya Raghupathi: వామ్మో.. నరేష్ మూడవ భార్య ఇంత నీచురాలా? బయటపడిన షాకింగ్ నిజాలు
ఆయన మరెవరో కాదు..2000 దశాబ్ద ప్రారంభం లో ఇండస్ట్రీ ని ఒక్క ఊపిన తరుణ్..బాలనటుడిగా కెరీర్ ని ప్రారంభించిన తరుణ్ ఆ తర్వాత హీరో గా మారి ఎన్నో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..యూత్ లో అప్పట్లో ఈయనకి ఉన్న క్రేజ్ వేరు..ఇక ఆ తర్వాత స్క్రిప్ట్స్ సెలక్షన్ లో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వరుసగా ఫ్లాప్స్ చూసి కెరీర్ లో అవకాశాలు మెల్లగా కోల్పోయాడు..ఆ తర్వాత ఆయనకీ సినెమాలకు పూర్తిగా దూరం అయ్యి బిజినెస్ లోకి దిగి గొప్పగా రాణిస్తున్నాడు..ఇప్పుడు ఈ క్రేజ్ హీరో ని బిగ్ బాస్ 6 లోకి తీసుకొచ్చేందుకు స్టార్ మా యాజమాన్యం చాలా గట్టి ప్రయత్నాలే చేస్తుంది..గతం లో కూడా తరుణ్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నట్టు చాలా వార్తలే వచ్చాయి..కానీ ఆ వార్తలన్నీ కూడా నిజం కాదని తరుణ్ అధికారికంగా తెలిపాడు..ఇప్పుడు మరోసారి మరోసారి అలాంటి వార్తలే వస్తుండడం తో ఇది కూడా రూమరేనేమో అనే సందేహం మొదలైంది పేక్షకుల్లో..కానీ అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బిగ్ బాస్ హౌస్ కి తరుణ్ వస్తున్నట్టే తెలుస్తుంది..తెలుగు ప్రేక్షకులకు ఆయన దూరమయ్యి చాలా కాలం అవ్వడం తో ఈ షో ద్వారా మళ్ళీ దగ్గరవడానికి చూస్తున్నారనే టాక్ వినిపిస్తుంది..మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ చూడాలి

Also Read: Vijay Deverakonda- Rashmika Mandanna: రష్మిక కోసం పూజా హెగ్డేకి హ్యాండ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ