
Telugu Film Industry: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ల ట్రెండ్ నడుస్తోంది. చిన్నాచితకా హీరోల దగ్గర నుంచి పెద్ద పెద్ద హీరోల వరకూ మల్టీస్టారర్ల పై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, సీనియర్ హీరోలకు, చివరకు ఫేడ్ అవుట్ హీరోలకు కూడా అవకాశాలు వస్తున్నాయి గానీ, హీరో రాజశేఖర్ కు మాత్రం సరైన ఛాన్స్ రావడం లేదు. మంచి పాత్ర దొరికితే విలన్ గా కూడా నటిస్తాను మహాప్రభో అంటూ రాజశేఖర్ ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో గొంతు చించుకుని అరిచాడు.
కానీ రాజశేఖర్ కు మాత్రం ఏ బడా దర్శకుడు చిన్న పాత్ర కూడా ఇవ్వలేదు. నిజానికి మల్టీస్టారర్ సినిమాలలో రాజశేఖర్ కి మంచి పాత్రలను డిజైన్ చేయవచ్చు. పైగా పవర్ ఫుల్ విలన్ పాత్రలకు కూడా రాజశేఖర్ పర్ఫెక్ట్ ఛాయిస్. జగపతిబాబు ఇప్పటికే బోర్ కొట్టేశాడు. చేసిన పాత్రలనే జగపతిబాబు చేయాల్సి వస్తోంది.
అన్ని సినిమాల్లో ఒకే తరహా పాత్రలు చేస్తే.. ఆ నటుడికే నష్టం. జగపతిబాబు పరిస్థితి కూడా ప్రస్తుతం ఇదే. కాబట్టి.. జగపతిబాబు కూడా రెగ్యులర్ పాత్రలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. మేకర్స్ కూడా కొత్తగా ట్రై చేయాలి. రాజశేఖర్ లాంటి నటులను వాడుకోవాలి. ఎలాగూ ఏ పాత్ర అయినా చేస్తాను అని రాజశేఖర్ ఇదివరకే ప్రకటించారు.
ఎంతైనా హీరోగా మార్కెట్ పడిపోయాక, ఇక ఎవరైనా విలన్ రోల్స్ కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ కు షిఫ్ట్ అయిపోవడమే ఉతమైన పని. అందుకే రాజశేఖర్ కూడా తన కెరీర్ ను మార్చుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. కానీ రాజశేఖర్ కు మాత్రం అవకాశాలు ఇవ్వడం లేదు. ఎప్పటికప్పడు విలన్ గా ఆయన ఎంట్రీ వాయిదా పడుతూనే వస్తూ ఉంది.
నిజానికి బోయపాటి తన ‘అఖండ’ సినిమాలో రాజశేఖర్ ను విలన్ గా పరిచయం చేయాలనుకున్నారు. కానీ ఎందుకో ఆ ప్రయత్నం మధ్యలోనే వదిలేశారు. కారణం.. రెమ్యునరేషన్ అని టాక్ నడుస్తోంది. అయినా రాజశేఖర్ కూడా హీరోలా భారీ మొత్తంలో డిమాండ్ చేయకుండా.. కాస్త చూసీచూడనట్టు సర్దుకుపోతే అవకాశాలు పెరుగుతాయి. అపుడు నన్ను వాడుకోండి మహాప్రభో అంటూ తపన పడక్కర్లేదు.