Tollywood Heroine : ఇందులో హీరో నాని కి జోడిగా మృనాల్ నటించింది. హాయ్ నాన్న సినిమాలో మృనాల్ చెల్లెలిగా నటించిన అమ్మాయి కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో ఒక స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్స్ అందుకుంటున్నారు. విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ నాని తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. నాని దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర హిట్స్ అందుకున్న తర్వాత రీసెంట్ గా హిట్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శైలేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకుంది. థియేటర్లలో ప్రస్తుతం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. నాని హిట్ 3 సినిమాలో మాస్ పాత్రలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా హీరో నాని కి సంబంధించిన పాత ఫోటోలు కొన్ని సామాజిక మాధ్యమాలలో అందరిని ఆకట్టుకుంటున్నాయి.
ఈ క్రమంలోనే నాని ఒక అమ్మాయితో కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వరులు అవుతుంది. ఈమె హాయ్ నాన్న సినిమాలో హీరో నాని తో కలిసి నటించింది. ఈ అమ్మాయి పేరు దృష్టి తల్వార్. దృష్టి తల్వార్ హాయ్ నాన్న సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్ చెల్లెలి పాత్రలో అద్భుతంగా నటించిన. ఢిల్లీకి చెందిన దృష్టి తల్వార్ ఆగస్టు 30, 1998లో పుట్టింది. దృష్టి తల్వార్ టిక్ టాక్ వీడియోస్, యూట్యూబ్ వీడియోస్ అలాగే ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది.
ఆ తర్వాత ఈమె మోడలింగ్ రంగంలో అవకాశం అందుకుంది. పంజాబ్ సినిమా చోబర్తో ఆ సినిమా ఇండస్ట్రీలోకి 2022లో ఎంట్రీ ఇచ్చింది. పంజాబీ సినిమా ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూనే దృష్టి తల్వార్ సోషల్ మీడియాలో కూడా అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో దృష్టి తల్వార్ కు చాలా ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ తో దృష్టి తల్వార్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాన్ని అందుకుంది. నాచురల్ స్టార్ నాని హాయ్ నాన్న సినిమాలో అవకాశాన్ని అందుకుంది. ఇందులో హీరోయిన్ చెల్లెలి పాత్రలో కనిపించే ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఈమె ప్రైవేట్ సాంగ్స్ తో కూడా బాగా ఫేమస్ అయింది. ఇంస్టాగ్రామ్ లో దృష్టి కల్వర్కు ఏకంగా 139 కె ఫాలోవర్స్ ఉన్నారు.