Tollywood Heroine : సినిమా ఇండస్ట్రీ లోకి ఎన్నో ఆశలతో హీరోయిన్ గా అవకాశం అందుకని ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంతమంది ముద్దుగుమ్మలు కేవలం కొన్ని సినిమాలకే పరిమితమవుతారు. తొలి సినిమాతో భారీ విజయం అందుకున్నప్పటికీ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేక సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోతారు. మరి కొంతమంది కెరియర్ లో వరుస అవకాశాలు వస్తున్న సమయంలో పెళ్లి చేసుకుని కూడా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయి తమ కెరీయర్ని వదులుకుంటారు. మనం చెప్పుకోబోయే హీరోయిన్ అందం, అభినయం ఉన్నా కూడా అవకాశాలు అందుకోలేక సినిమా ఇండస్ట్రీలో సైలెంట్ గా ఉండిపోయింది. ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకోవాలి స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశం అందుకోవాలి అంటూ చాలామంది హీరోయిన్లు ఎన్నో ఆశలతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారు. కానీ చాలా అందంగా ఉన్నా కూడా కొంతమందికి మాత్రం అదృష్టం కలిసి రాక కొన్ని సినిమాలకే పరిమితం అయిపోతారు. అవకాశాలు రాక చాలా మంది బిజినెస్ లో అడుగుపెడుతున్నారు.
అలాగే మరి కొంతమంది హీరోయిన్లు పెళ్లి చేసుకుని కూడా సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. కానీ ఒక టాలీవుడ్ హీరోయిన్ మాత్రం తనకు అదృష్టం కలిసి రాకపోవడంతో ఇప్పటికీ అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. తనకు అవకాశాన్ని కల్పించమంటూ కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఈమె ఇప్పటివరకు తెలుగులో చేసింది కేవలం నాలుగు సినిమాలే. టాలీవుడ్లో తొలి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. తొలి సినిమా హిట్ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. కానీ తొలి సినిమా తప్ప మిగిలిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అవడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు క్రమంగా తగ్గిపోయాయి. దీంతో ఈ బ్యూటీ ఇతర భాషలలో సినిమాలలో నటించింది. కానీ అక్కడ కూడా అనుకునే స్థాయిలో రాణించలేకపోయింది. బి ఏ జయ దర్శకత్వం వహించిన లవ్లీ సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అయ్యింది. లవ్లీ సినిమాలో ఆది సాయికుమార్ హీరోగా నటించాడు.
తొలి సినిమాతోనే తన క్యూట్ పెర్ఫార్మెన్స్ తో మంచి విజయం అందుకుంది శాన్వి శ్రీ వాస్తవ. ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే సుశాంత్ తో అడ్డా, హీరో మంచు విష్ణు తో రౌడీ, అలాగే మరోసారి ఆది సాయికుమార్ తో ప్యార్ మే పడిపోయానే అనే సినిమాలలో నటించింది. కానీ ఈ సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆమెకు అవకాశాలు రాలేదు. అతడే శ్రీమన్నారాయణ అనే డబ్బింగ్ సినిమాతో శాన్వి మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ సమయంలోనే శాన్వి తనకు తెలుగులో అవకాశం రావడం లేదు అంటూ కన్నీళ్లు కూడా పెట్టుకుంది. స్టేజ్ పైన మాట్లాడుతూ శాన్వి తనకు ఎందుకు అవకాశాలు రావడం లేదో అర్థం కావడం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
View this post on Instagram