https://oktelugu.com/

Payal Rajput: ఆ విషయంలో తగ్గేదే లే అంటున్న పాయల్ రాజ్ పుత్ !.

Payal Rajput: టాలీవుడ్ యువతకి క్రష్ గా మారిన బ్యూటీలలో పాయల్ రాజ్ పుత్ ఒకరు. చూపు తిప్పుకోలేని తన హాట్ ఫిగర్ తో పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే కుర్రాళ్లని అట్రాక్ట్ చేసింది. గత ఏడాది వరకు పాయల్ రాజ్ పుత్ కెరీర్ టాలీవుడ్ లో బాగానే సాగింది. కానీ, ప్రస్తుతం పాయల్ కెరీర్ అయోమయంలో పడింది. ఈ ఏడాది ఆరు నెలలు గడుస్తున్నా ఆమె చేతిలో ఒక్క కొత్త ఆఫర్ కూడా లేదు. […]

Written By:
  • Shiva
  • , Updated On : July 1, 2022 / 05:07 PM IST
    Follow us on

    Payal Rajput: టాలీవుడ్ యువతకి క్రష్ గా మారిన బ్యూటీలలో పాయల్ రాజ్ పుత్ ఒకరు. చూపు తిప్పుకోలేని తన హాట్ ఫిగర్ తో పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే కుర్రాళ్లని అట్రాక్ట్ చేసింది. గత ఏడాది వరకు పాయల్ రాజ్ పుత్ కెరీర్ టాలీవుడ్ లో బాగానే సాగింది. కానీ, ప్రస్తుతం పాయల్ కెరీర్ అయోమయంలో పడింది. ఈ ఏడాది ఆరు నెలలు గడుస్తున్నా ఆమె చేతిలో ఒక్క కొత్త ఆఫర్ కూడా లేదు.

    Payal Rajput

    ‘ఆర్ఎక్స్ 100’ మూవీలో పాయల్ రాజ్ పుత్ జోరు చూశాక తప్పకుండా ఈ యంగ్ బ్యూటీ టాప్ లీగ్ కి వెళుతుందని భావించారు. మతి పోగొట్టే ఒంపు సొంపులతో కుర్రాళ్లని పాయల్ విపరీతంగా ఆకర్షించింది. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత పాయల్ తన రెమ్యునరేషన్ పెంచుతూ వచ్చింది. సక్సెస్ జోరులో కొన్ని చిత్రాలకు పాయల్ రాజ్ పుత్ అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చారు నిర్మాతలు.

    Also Read: Sammathame Collections: ‘సమ్మతమే’ 7 డేస్ కలెక్షన్స్.. ఇంకెన్ని కోట్లు రావాలంటే ?

    కానీ, పాయల్ రాజ్ పుత్ కి వరుసగా ప్లాపులు పడ్డాయి. ఆ తర్వాత కూడా పాయల్ రెమ్యునరేషన్ పెంచేసింది. ప్రస్తుతం ఈ భారీ బ్యూటీ ఏకంగా కోటి డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కోటి నుంచి ఒక్క రూపాయి కూడా తగ్గడం లేదట. దీంతో నిర్మాతలు పాయల్ ని సంప్రదించడం లేదని వార్తలు వస్తున్నాయి.

    Payal Rajput

    ఈ ఏడాది పాయల్ రాజ్ పుత్ ఒక్క ఆఫర్ కూడా అందుకోకపోవడానికి కారణం ఇదే అని అంటున్నారు. పాయల్ 50 నుంచి 70 లక్షల వరకు డిమాండ్ చేస్తే రీజనబుల్ గా ఉంటుందని ప్రొడ్యూసర్స్ భావిస్తున్నారు. కానీ పాయల్ రాజ్ పుత్ మాత్రం కోటికి తగ్గేదే లే అంటుంది.

    రెమ్యునరేషన్ విషయంలో పాయల్ రాజ్ పుత్ మొండి పట్టు ఆమె సినీ ఛాన్స్ లకు శాపంగా మారుతోంది. కొత్తగా వచ్చిన శ్రీలీల, కృతి శెట్టి లాంటి హీరోయిన్లు మంచి ఆఫర్స్ ఎగరేసుకుపోతున్నారు. ఇలాంటి సమయంలో ముదురు భామలా మారిపోయిన పాయల్ రాజ్ పుత్ కోసం ఎందుకు నిర్మాతలు వెంటపడతారు. ఈ విషయాన్ని ఆమె ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది.

    Also Read:Chor Baazar 7 Days Collections: పూరి వారసుడికి సాలిడ్ ప్లాప్

    Tags