Tollywood Heroes: మొదటి సినిమాతోనే విజయం సాధించడం అంటే.. అది అదృష్టం ఇచ్చిన అవకాశం అనుకోవాలి. పైగా మొదటి ప్రయత్నంలోనే విజయం సాధిస్తే ఆ విజయం తాలూకు జ్ఞాపకమే వేరు. ఎందుకంటే.. సినిమా ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే సక్సెస్ కొట్టడం అంత ఈజీ కాదు. టాలెంట్ తో పాటు అదృష్టం ఉంటేనే మొదటి ప్రయత్నం సక్సెస్ అవుతుంది.
సినిమా విజయం అనేది.. ఒక్కో సినిమాకు ఒక్కోలా ఉంటుంది. అందుకే.. ఇండస్ట్రీలో ఏ గాలి ఎటు వైపు మళ్ళుతుందో ఏ సినిమా ఎప్పుడు హిట్ అవుతుందో ఎవరికీ క్లారిటీ ఉండదు. అయితే, మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న హీరోలు కొందరు ఉన్నారు. వారెవరో చూద్దామా ?
రామ్ పోతినేని :
మొదటి సినిమా ‘దేవదాసు’. అయినా విజయంలో మాత్రం దాసులకే దాసు. మొదటి సినిమాతోనే రామ్ మంచి పేరుతో పాటు సక్సెస్ ను కూడా సంపాదించుకున్నాడు.

ఉదయ్ కిరణ్ :
ఉదయ్ కిరణ్ తొలి సినిమా ‘చిత్రం’. చిన్న చిత్రంగా వచ్చిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకుని ఆ తర్వాత లవర్ బాయ్ ఇమేజ్ తో కొన్నాళ్ళు మోస్ట్ వాంటెడ్ హీరోగా ఉదయ్ కిరణ్ నిలిచాడు. కొన్ని కారణాల వల్ల నేడు ఉదయ్ మన మధ్యన లేడు.

తరుణ్:
‘నువ్వే కావాలి’తో రికార్డులు కొట్టాడు తరుణ్. మొదటి సినిమాతోనే పెద్ద విజయం సాధించే సరికి తరుణ్ పెద్ద స్టార్ అవుతాడు అనుకున్నారు. కానీ, ప్లాప్ ల దెబ్బకు సినిమాలకు దూరంగా సొంత వ్యాపారాల్లో నిమగ్నమైపోయాడు.

‘అల్లరి’ నరేష్ :
అల్లరి సినిమా విజయంతో తన ఇంటి పేరునే మార్చుకున్నాడు. ఈవీవీ గారబ్బాయిగా ఎన్నో సినిమాలు చేసి ఎన్నో విజయాలు అందుకున్నాడు.

నితిన్ :
‘జయం’ అనే మొదటి సినిమాతోనే నితిన్ విజయాన్ని అందుకున్నాడు. మధ్యలో కొన్ని దారుణమైన అపజయాలు ఎదురైనా.. పట్టు విడవకుండా ప్రయత్నిస్తూ ఎట్టకేలకు హీరోగా విజయాల బాట పట్టాడు.

Also Read: చరణ్, తారక్ లను ప్రశంశలతో ముంచెత్తిన స్టార్ హీరో… ఏమన్నాడంటే ?
నిఖిల్ :
మొదటి సినిమా ‘హ్యాపీ డేస్’తో మంచి పేరు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించాడు. వరుణ్ సందేశ్ కూడా ఈ సినిమాతో మొదటి సినిమాతో విజయం సాధించిన హీరోల సరసన చేరాడు.

సిద్ధార్థ్ మొదటి సినిమా ‘బాయ్స్’తో వైష్ణవ్ తేజ్ ఉప్పెనతో, ఇంకా సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా కొందరు మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.
Also Read: ఆ మాస్ డైరెక్టర్ తో మూవీ ఓకే చేసిన నందమూరి నటసింహం ?