Homeఎంటర్టైన్మెంట్Tollywood Actors Writers: హీరోలే రైటర్స్.. టాలీవుడ్ లో ఎవరెవరున్నారో తెలుసా?

Tollywood Actors Writers: హీరోలే రైటర్స్.. టాలీవుడ్ లో ఎవరెవరున్నారో తెలుసా?

Tollywood Actors Writers: ఇటీవల కాలంలో పరిస్థితులు మారుతున్నాయి. సినిమాల్లో కూడా వైవిధ్యాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు హీరోలు కేవలం నటనకే పరిమితం అయ్యేవారు. కానీ ప్రస్తుతం ఆ హీరోలే తమ సినిమాలకు కథలు రాసుకుంటూ ప్రేక్షకుల చేత ఔరా అనిపించుకుంటున్నారు. తమకున్న టాలెంట్ ను స్ర్కిప్ట్ రూపంలో చూపిస్తూ దర్శకులకే సవాలు చేస్తున్నారు. ఈ కోవలో అడివి శేషు, సిద్దూ, నవీన్ లాంటి వారు తమ సత్తా చాటుతున్నారు. పెన్ కు పని చెబుతూ తమలో కూడా ఓ రచయిత ఉన్నాడని నిరూపిస్తున్నారు. వైవిధ్యమైన కథలతో దర్శకులకే ఆశ్చర్యం కలిగిస్తున్నారు.

Tollywood Actors Writers
Tollywood Actors Writers

దర్శకుడే రచయిత అయితే కథకు మంచి స్కోప్ ఉంటుంది. తన కలలకు అనుగుణంగా కథను నడిపించే సత్తా దర్శకుడికి ఉంటుంది. అందుకే పూరీజగన్నాథ్, త్రివిక్రమ్, కొరటాల శివ, హరీశ్ శంకర్ వారి కథలు వారే రాసుకుంటారు. కానీ ప్రస్తుతం హీరోలు కూడా తమ కథలు తామే రాసుకుని హిట్లు కొడుతున్నారు. ఈ కోవలో మొదట వినిపించే పేరు అడివి శేషు. ఆయన గూఢచారి సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. దాని కథ అందించింది శేషునే.

Also Read: Surya Remuneration In Vikram Movie: విక్రమ్ సినిమాలో 5 నిమిషాల పాత్ర కోసం సూర్య ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా??

తాజాగా విడుదలైన మేజర్ సినిమాకు కూడా కథ శేషునే కావడం తెలిసిందే. జూన్ 3న విడుదలైన మేజర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అంతే కాదు రెండు సినిమాలకు మెగాఫోన్ కూడా పట్టుకుని దర్శకుడిగా అవతారమెత్తాడు. మొత్తానికి తెలుగు సినిమాల్లో హీరోలు కూడా దర్శకులుగా మారడం కొత్త సంప్రదాయమే. ఇదివరకు దర్శకులు హీరోలుగా మారినా సీన్ రివర్స్ అవుతోంది. గతంలో కూడా దాసరి నారాయణ రావు తన సినిమాలకు తానే కథ రాసుకునే వారు.

Tollywood Actors Writers
siddu jonnalagadda

మరో హీరో సిద్దూ జొన్నలగడ్డ కూడా రైటరే. కృష్ణ అండ్ హిస్ లీలలు సినిమాకు కథ, స్ర్రీన్ ప్లే అందించాడు. ఇటీవల విడుదలైన డీజే టిల్లుకు కూడా కథ, మాటలు రాశారు. ఇలా తమకున్న ప్రతిభను ఇలా పదును పెడుతూ తమలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. నవీన్ పొలిశెట్టి కూడా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాకు కథ రాశారు. ఎస్ఆర్ కల్యాణ మండపంతో కిరణ్ కూడా కథా రచయితగా మారాడు. దీంతో కొత్త తరం హీరోలందరు మంచి రచయితలుగా మారి తమ చిత్రాలకు తామే కథలు అందించుకోవడం విశేషం.

Also Read:Pooja Hegde Remuneration: షాకింగ్ న్యూస్… పూజాకు నాలుగు కోట్లు సిబ్బందికి మరో కోటి

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular