Tollywood Hero : కానీ ఈ యంగ్ హీరోకు ఈ ఏడాది కొంత నిరాశనే మిగిలింది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన అతని సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. కథపరంగా కూడా కొన్ని విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటోలో స్టూడెంట్స్ అందరూ యూనిఫామ్ లో ఉంటే అందులో కేవలం ఒక కుర్రాడు మాత్రమే కలర్ఫుల్ డ్రెస్ లో ఉన్నాడు. ఈ స్కూల్ గ్రూప్ ఫోటోలో అతను స్పెషల్ గా కనిపిస్తున్నాడు. ఈ కుర్రాడు ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరో. తన స్వయంకృషితో ఎటువంటి సపోర్ట్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. కెరియర్ తొలినాళ్లలో మాసి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత ఇతను లవ్, రొమాంటిక్ అలాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. కేవలం నటనతోనే కాకుండా దర్శకుడిగా అలాగే నిర్మాతగా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన టాలెంట్ చూపించాడు.
Also Read : జయం సినిమా చిన్నారి ప్రస్తుతం ఎంతలా మారిపోయిందో చూశారా..
సినిమాలతో పాటు తాను చేసే కామెంట్స్ తో కూడా ఎక్కువగా ఈ యంగ్ హీరో వార్తల్లో ఉంటాడు. ఈ క్రమంలో కొన్నిసార్లు సామాజిక మాధ్యమాలలో విమర్శలు అలాగే ట్రోలింగ్స్ కూడా ఎదుర్కొంటున్నాడు. చిన్నప్పటి ఫోటోను చూసి ఈ యంగ్ హీరో ఎవరో ఇప్పటికే చాలామంది గుర్తుపట్టి ఉంటారు. ఈ హీరో మరెవరో కాదు విశ్వక్ సేమ్. యంగ్ హీరో విశ్వక్ సేన్ 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెళ్ళిపోమాకే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. కానీ విశ్వక్ సెన్ కు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో బాగా గుర్తింపు వచ్చింది.
ఫలక్ నూమా దాస్ అనే సినిమాతో దర్శకుడిగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. అలాగే ఇక హిట్ ఫస్ట్ కేస్, పాగల్, ఓరి దేవుడా, అశోక వనంలో అర్జున కళ్యాణం, దాస్ కా దమ్ కి, గ్యాంగ్స్ ఆఫ్ గోదారి, మెకానిక్ రాఖి అనే సినిమాలతో విశ్వక్ సేన్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. చివరిగా ఇతను లైలా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఈ సినిమాకు కంటెంట్ పరంగా కూడా విమర్శలను ఎదుర్కోవడంతో విశ్వక్ సెన్ బహిరంగంగా కూడా క్షమాపణలు తెలిపాడు. ప్రస్తుతం ఈ టాలీవుడ్ యంగ్ హీరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఫంకీతోపాటు వి ఎస్ 13 సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు.