Tollywood hero remunerations : సక్సెస్ ఉన్న వాళ్ళ చుట్టే ఇండస్ట్రీ తిరుగుతోంది. అందుకే ఒక సినిమా సక్సెస్ అవ్వగానే ఇప్పుడున్న హీరోలు భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఒక సినిమా సూపర్ సక్సెస్ అయిందంటే ఆ మూవీ కి అంతో ఇంతో కలెక్షన్స్ వస్తాయి. అలాకాకుండా ఒక సినిమా హిట్ అయినంత మాత్రాన వాళ్ల తర్వాత సినిమాకి కూడా అంతే కలెక్షన్స్ వస్తాయి అనే గ్యారెంటీ లేదు. కాబట్టి ఇప్పుడున్న మీడియం రేంజ్ హీరోల్లో కొంతమంది నింగి విడిచి సాము చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళ మార్కెట్ ఎంత, వాళ్ల మూవీ సూపర్ హిట్ అయితే ఎంత కలెక్షన్స్ వస్తాయి…ఒకవేళ సినిమా తేడా కొడితే ప్రొడ్యూసర్ కి ఏ మేరకు నష్టాలు వస్తాయి. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని రెమ్యునరేషన్స్ ను డిమాండ్ చేయాలి. అలా కాకుండా ముందు సినిమా సక్సెస్ అయింది కదా! దాని ఇంపాక్ట్ తర్వాత సినిమా మీద ఉంటుంది ఎలాగూ ఆ సినిమా కూడా సక్సెస్ ని సాధిస్తోంది అనుకుంటే అది మన మూర్ఖత్వం అవుతోంది. పెద్దగా మార్కెట్ లేకపోయిన ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయడం సరైనది కాదు. సినిమాలో కంటెంట్ ఉంటేనే సినిమా ఆడుతోంది. ముందు సినిమా తర్వాత సినిమాలను బేస్ చేసుకుని ఇక్కడ ఏమీ ఉండదు. ఏ సినిమాకి అదే సెపరేట్ చూస్తూ ఉంటారు… కాబట్టి రియాల్టీని తెలుసుకొని ముందుకు సాగితే మంచిదని మరి కొంతమంది హెచ్చరిస్తున్నారు. నిజానికి ప్రొడ్యూసర్లు కూడా ఈ విషయంలో చాలావరకు కేర్ ఫుల్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
ఏ కొంచెం మార్కెట్ ఉన్న హీరో అయిన సక్సెస్ సాధిస్తే చాలు తొందరగా అతనికి అడ్వాన్సులు ఇచ్చేసి ప్రస్తుతం ఉన్న రెమ్యూనరేషన్ కంటే ఎక్కువగా పెంచేసి అతన్ని లాక్ చేస్తున్నారు. దీనివల్ల హీరోలు సైతం వాళ్లకు భారీ మార్కెట్ క్రియేట్ అయిందనే ఒక అపోహలో బతుకుతున్నారు. అలా కాకుండా వాళ్ళ రియాల్టీ ఏంటో వాళ్లకు చెప్పి మన మూవీ బడ్జెట్ ఎంత అవుతోంది.
మీకు రెమ్యూనరేషన్ గా ఎంత ఇవ్వాలి అనేది చెబితే వాళ్లు కూడా క్లారిటీగా ఉంటారు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రొడ్యూసర్లు హీరోల దగ్గరికి వెళ్లి వాళ్ళకి అడ్వాన్సులు ఇచ్చేసరికి వాళ్ళు తోపుల్లగా ఫీల్ అయిపోయి భారీ డబ్బులను డిమాండ్ చేస్తూ ఉండడం విశేషం… నిజానికి ఒక మీడియం రేంజ్ హీరో రీసెంట్ గా 20 కోట్లు డిమాండ్ చేశాడట. ఆయనకున్న మార్కెట్ 20 కోట్లు కూడా ఉండదు.
అలాంటిది ఆయనకే 20 కోట్లు ఇస్తే మూవీ మేకింగ్ కి ఎంత అవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ కి ఎంత కావాలి… ఇవన్నీ ఆలోచించిన ప్రొడ్యూసర్ మూవీని కాన్సిల్ చేశాడట… ఇక దీంట్లో హీరోల తప్పు ఎంతుందో ప్రొడ్యూసర్ల తప్పు కూడా అంతే ఉంది. దీనికంతటికి చెక్ పెట్టాల్సిన అవసరమైతే ఉంది…