https://oktelugu.com/

Ravi Teja: ఆ ‘హీరోయిన్లే’ కావాలి.. ఇదెక్కడి పైత్యంరా బాబు

Ravi Teja: హీరో రవితేజ తన సినిమాల విషయంలో కథలో గానీ కథనంలో గానీ వేలు, కాలు లాంటివి పెట్టడు. కానీ.. హీరోయిన్ల విషయంలో మాత్రం ఆయన వ్యవహార శైలి వేరు. సహజంగా ఏ సినిమాకైనా హీరోయిన్‌ల ఎంపిక‌ అనేది క‌థను బట్టి ఉంటుంది. పాత్ర డిమాండ్ చేసిన మేర‌కే.. ఆయా నటీనటులను ఎంపిక చేస్తారు. అయితే, తెలుగు సినిమాల్లో మాత్రం హీరోని ఎంచుకొన్న త‌ర‌వాత‌… ఆయ‌న ప‌క్క‌న హీరోయిన్ ఎవ‌రైతే బాగుంటుంది ? అని ఆ […]

Written By:
  • Shiva
  • , Updated On : July 1, 2022 / 08:49 AM IST
    Follow us on

    Ravi Teja: హీరో రవితేజ తన సినిమాల విషయంలో కథలో గానీ కథనంలో గానీ వేలు, కాలు లాంటివి పెట్టడు. కానీ.. హీరోయిన్ల విషయంలో మాత్రం ఆయన వ్యవహార శైలి వేరు. సహజంగా ఏ సినిమాకైనా హీరోయిన్‌ల ఎంపిక‌ అనేది క‌థను బట్టి ఉంటుంది. పాత్ర డిమాండ్ చేసిన మేర‌కే.. ఆయా నటీనటులను ఎంపిక చేస్తారు. అయితే, తెలుగు సినిమాల్లో మాత్రం హీరోని ఎంచుకొన్న త‌ర‌వాత‌… ఆయ‌న ప‌క్క‌న హీరోయిన్ ఎవ‌రైతే బాగుంటుంది ? అని ఆ తర్వాత ఎంపిక చేస్తారు.

    Ravi Teja

    కానీ, రవితేజ సినిమాల వరకు మాత్రం.. హీరోయిన్ల ఎంపిక వేరేలా ఉంటుంది. ద‌ర్శ‌కుడు, నిర్మాత‌లు కిందా మీద ప‌డీ హీరోయిన్‌ ని సెట్ చేయాలి. రవితేజతో సినిమా అంటే.. ఎవ‌రిని ప‌డితే వాళ్ల‌ని హీరోయిన్‌గా తీసుకోవ‌డానికి లేదు. అస‌లు హీరోయిన్ల ఎంపిక ద‌ర్శ‌కుడు, నిర్మాత చేతుల్లో ఉండదు. రవితేజ చేతిలో అడ్వాన్సు ప‌డ‌గానే.. ఆయనే తన సరసన ఏ హీరోయిన్ బాగుంటుందో చెప్పేస్తాడు.

    Also Read: Pakka Commercial : గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ ట్విట్టర్ రివ్యూ.. మూవీ టాక్ ఎలా ఉందంటే?

    రవితేజ లాంటి హీరో `ఫ‌లానా హీరోయిన్ కావాలి..` అని చెబితే.. ఏ నిర్మాత మాత్రం తీసుకు రాడు. ఆకాశం కింద‌ప‌డి, భూమి బ‌ద్ద‌లైనా స‌రే, ఆ హీరోయిన్‌ నే పట్టుకొస్తారు. పట్టుకు రావాల్సిందే. అందుకే, రవితేజ ద‌గ్గ‌ర హీరోయిన్లకు సంబంధించి ఎప్పుడు ఓ చెక్ లిస్టు ఉంటుంది. ఆ లిస్ట్ లో హీరోయిన్ల వివ‌రాల‌న్నీ ఉంటాయి. `ఆ హీరోయిన్‌ బాగా చేస్తోంది. ఆమెకు ఛాన్స్ ఇద్దాం. త‌న‌నే ఈసారి ఎంచుకోండి..` అని రవితేజ క్లారిటీగా చెబుతాడు.

    మరి హీరోగారు అలా మొహమాటం లేకుండా… ద‌ర్శ‌క, నిర్మాత‌ల‌కు ఆదేశాలు జారీ చేస్తే.. ఇక చేసేదేం ఉంది. అందుకే.. హీరో చెప్పిన హీరోయిన్ నే వెదికి తీసుకొస్తారు. మొత్తానికి రవితేజ సినిమాల‌కు హీరోయిన్ల‌కు ఎంపిక చేసే ప‌ద్ధ‌తి ఇదే. అయితే.. ఇక్కడ ఒక విశేషం ఉంది. ఏ హీరో అయినా తన సరసన స్టార్ హీరోయిన్ నటించాలి అని ముచ్చట పడతాడు.

    Ravi Teja

    కానీ.. రవితేజ మాత్రం తన సరసన చిన్నాచితకా భామలే కావాలని ఆశ పడుతున్నాడు. రవితేజ లాస్ట్ సినిమా ఖిలాడీ. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లున్నారు. ఈ ఇద్ద‌రూ ఊరూ, పేరూ లేనివాళ్లే. మరి వాళ్ళనే ఎందుకు హీరోయిన్లుగా పెట్టుకున్నారు ?, వాళ్ల‌తో నటించాలని రవితేజ తెగ తాప‌త్ర‌య‌ప‌డిపోయాడట. అందుకే.. వాళ్ల‌నే తీసుకోవాల్సి వ‌చ్చింది. చివరకు సినిమా పై బజ్ లేకుండా పోయింది. ఇప్పుడు మ‌రో సినిమా విషయంలోనూ రవితేజ ఇలాగే వ్యవహారిస్తున్నాడని టాక్ నడుస్తోంది.

    Also Read:2022 Tollywood Report: 2022 టాలీవుడ్ రిపోర్ట్ : 6 నెలల తెలుగు సినిమాల రివ్యూ
    Recommended Videos


    Tags