Tollywood Hero In Dhurandhar 2: ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద ఎవ్వరూ ఊహించని రేంజ్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తున్న చిత్రం ‘దురంధర్'(Dhurandhar Movie). రణవీర్ సింగ్(Ranveer Singh) హీరో గా నటించిన ఈ సినిమా వెయ్యి కోట్ల గ్రాస్వసూళ్లను నేటితో అందుకుంది. ఇది వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ తో ఆగేలా కనిపించడం లేదు. ఫుల్ రన్ లో 1500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో సింగల్ లాంగ్వేజ్ మీద ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లను రాబట్టిన సినిమా ఒక్కటి కూడా లేదు. పుష్ప 2 , బాహుబలి 2 వంటి సినిమాలకు కూడా ఇతర బాషల నుండి వచ్చిన వసూళ్లతో కలుపుకునే 1500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ఈ చిత్రానికి కేవలం హిందీ బాషా నుండి ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయి.
ఇదంతా పక్కన పెడితే వచ్చే ఏడాది మార్చ్ 19న ఈ చిత్రానికి సీక్వెల్ విడుదల కాబోతుంది. ఈ సీక్వెల్ ఒక్క హిందీ బాషలోనే కాదు, తెలుగు, తమిళం,మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా విడుదల కాబోతుంది. ఇకపోతే మొదటి భాగం లో విలన్ గా నటించిన అక్షయ్ ఖన్నా కి ఏ రేంజ్ క్రేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అసలు ఆ సినిమాలో హీరో ని డామినేట్ చేసాడు, 70 శాతం సినిమా సూపర్ హిట్ అవ్వడానికి అక్షయ్ ఖన్నా(Akshay Khanna) నే కారణం అని సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు. మరి పార్ట్ 2 లో విలన్ క్యారక్టర్ ఆ రేంజ్ ని మ్యాచ్ చెయ్యాలి కదా. అందుకే అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ని ఆ రోల్ కోసం సంప్రదించినట్టు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం. కెరీర్ లో మొట్టమొదటిసారిగా ఆయన కూలీ చిత్రం ద్వారా విలన్ గా మన ఆడియన్స్ కి తనలోని కొత్త కోణాన్ని చూపించాడు.
అయితే నాగార్జున ఫ్యాన్స్ కి ఆ రోల్ అసలు నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే చూపించారు కానీ, సెకండ్ హాఫ్ లో బాగా వీక్ చేసారని, రొటీన్ విలన్ క్యారక్టర్ ని నాగార్జున ఎలా ఒప్పుకున్నాడో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ‘దురంధర్ 2’ లో హీరో క్యారక్టర్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా నాగార్జున క్యారక్టర్ ఉంటుందట. మొదటి వారం లోనే వెయ్యి కోట్లు కొల్లగొట్టేంత స్టామినా ఉన్న ‘దురంధర్ 2’ లాంటి ప్రాజెక్ట్ లో నాగార్జున కి ఆ రేంజ్ రోల్ దొరకడం అంటే, అసలు సిసలు కం బ్యాక్ ఈ సినిమానే అని అంటున్నారు ఫ్యాన్స్.