దాంతో రకుల్ నిన్న సడెన్ గా ఈడీ ముందు హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. పైగా తనకు కేటాయించిన డేట్ కంటే ముందే.. రకుల్ ఈడీ అధికారుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఆమె తన బ్యాంక్ లావాదేవీల పత్రాలను కూడా పద్దతిగా తెచ్చి వివరణ ఇచ్చింది. అయితే, నిన్న రకుల్ ప్రీత్ సింగ్ ను ఈడీ అధికారులు దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించడమే అందర్నీ షాక్ గురి చేస్తోంది.
అసలు రకుల్ ను 9 గంటల పాటు ప్రశ్నలు అడిగేంత ఏముంది ? ఇండస్ట్రీలో ఉన్న సమాచారం ప్రకారం హైదరాబాద్ కి చెందిన డ్రగ్స్ కేసుకి (Drug Case) సంబంధించి పలు ప్రశ్నలు అడిగారు. అలాగే బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తితో ఉన్న పరిచయాల గురించి కూడా పలు ప్రశ్నలు అడిగారని టాక్ నడుస్తోంది. నిజానికి గతంలో ముంబైకి చెందిన ఎన్సీబీ అధికారులు కూడా ఇదే విషయం గురించి రకుల్ ను విచారించారు.
ఆ విచారణలో రకుల్ కొన్ని సమాధానాలు చెప్పింది. అయితే, ఆ సమాధానాల్లో చాలా వరకు అబద్దాలు అని అధికారులు గుర్తించారు. అందుకే, ఆమెను అన్ని గంటల పాటు అన్నీ రకాలుగా విచారించి పంపించారట. మరి ఆ విచారణలో ఎలాంటి నిజాలు బయట పడ్డాయో చూడాలి. అప్పుడెప్పుడో రెండేళ్ళ క్రితం ఈ డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ ని ఒక కుదుపు కుదిపేసింది.
ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఛార్మి లతో పాటు మరికొంతమంది నటులు, ఇతర టెక్నీషియన్స్ మీద పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఓ రేంజ్ లో హడావుడి చేశారు. చివరకు ఏమైంది అనేది.. ఆ తర్వాత ఎవరికీ క్లారిటీ లేదు. మరి ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందా ? లేక డ్రగ్ మాఫియాని ఇండస్ట్రీలో లేకుండా చేస్తారా ? చూడాలి.