Tollywood Directors: సినిమా ఇండస్ట్రీ సముద్రం లాంటిది. అందులో పడి కొట్టుకుపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజానికి ఇండస్ట్రీలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకోని నిలబడాలి అంటే దానికి గట్స్ ఉండాలి. లేకపోతే మాత్రం ఇక్కడ రాణించడం చాలా కష్టం అవుతోంది. ఇండియాలో ఇప్పటివరకు ఎవ్వరూ సాధించనటువంటి గొప్ప విజయాలను సాధిస్తున్న స్టార్ డైరెక్టర్లు కొంతమంది మాత్రమే ఉన్నారు… మనవాళ్లు పాన్ ఇండియా డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు.భారీబాడ్జెట్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక మలయాళం సినిమా దర్శకులు మాత్రం చిన్న కాన్సెప్ట్ లతో సినిమాలు చేసి మంచి విజయాలను సాధిస్తున్నారు…మన డైరెక్టర్స్ మాత్రం ఇప్పుడు 100 కోట్లతో సినిమా చేస్తే నెక్స్ట్ సినిమాకి 200 నుంచి 300 కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంతే తప్ప ఒక మంచి ఐడియాతో ఒక చిన్న సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు…
కానీ మలయాళం లో మాత్రం జీతూ జోసఫ్ లాంటి దర్శకుడు చిన్న బడ్జెట్ సినిమాలను చేస్తూ పెద్ద బడ్జెట్ సినిమాలను చేస్తున్నాడు. ఒకసారి ఒక మార్కెట్ క్రియేట్ అయిన దర్శకుడు మధ్యలో చిన్న సినిమాలను చేయడం వల్ల తన మార్కెట్ ఏమీ కోల్పోడు. చిన్న పాయింట్ తో సక్సెస్ సాధిస్తే వాళ్ళకి ఇంకా గొప్ప గుర్తింపు వస్తోంది. అందుకే చిన్న పెద్దా అనే తేడా లేకుండా దర్శకులు అన్ని రకాల సినిమాలను చేయాలి…
ఎప్పుడు భారీ బడ్జెట్ సినిమాలే వర్కౌట్ అవ్వవు… అప్పుడప్పుడు చిన్న సినిమాలు కూడా చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఇండస్ట్రీ బాగుపడుతోంది. అలాగే ప్రొడ్యూసర్స్ సైతం సేఫ్ జోన్ లో ఉంటారు… దర్శకుడు తో పాటు హీరోలు కూడా తక్కువ బడ్జెట్ సినిమాలను చేస్తే బాగుంటుంది. మలయాళంలో మోహన్ లాల్ లాంటి హీరో మంచి కథ ఉంటే తక్కువ బడ్జెట్ లో అయిన సినిమాలు చేస్తాడు.
రెమ్యూనరేషన్స్ బాగా తగ్గించుకొని మరి సినిమా చేయడానికి తను సిద్ధంగా ఉంటాడు…అలాగే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కమల్ హాసన్ సైతం ప్రయోగాత్మకమైన సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తాడు. కాబట్టి తను కూడా లో బడ్జెట్లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తాడు…మన తెలుగు హీరోలు, దర్శకులు సైతం ఇక మీదట అలాంటి సినిమాలు చేస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…