Sai Pallavi: పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందన్నది ఒప్పుకోవాల్సిన నిజం. అమ్మాయిలకు ఓ స్థాయి హీరోయిన్ అయ్యే వరకు ఈ తిప్పలు తప్పవు. ఒక్కోసారి స్టార్ హీరోయిన్స్ కి కూడా వేధింపులు ఎదురవుతాయి. లౌక్యం తెలిసిన తెలివిగల అమ్మాయిలు మాత్రమే తోడేళ్ళ నుండి తెలివిగా తప్పించుకుని తమ లక్ష్యం సాధిస్తారు. ఈ లైంగిక వేధింపులు తట్టుకోలేక చాలా మంది పరిశ్రమ నుండి వెళ్ళిపోతారు. కాగా టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవిని కూడా కమిట్మెంట్ అడిగారట.
సాయి పల్లవి కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసింది. మలయాళ చిత్రం ప్రేమమ్ తో హీరోయిన్ అయ్యింది. ప్రేమమ్ సూపర్ హిట్ కాగా సాయి పల్లవి వెలుగులోకి వచ్చింది. సహజ అందం, నటన, అద్భుతమైన డాన్స్ సాయి పల్లవిని ప్రత్యేకంగా మార్చాయి. ఇక తెలుగులో సాయి పల్లవి మొదటి చిత్రం ఫిదా. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా బ్లాక్ బస్టర్ కొట్టింది. తెలుగులో సాయి పల్లవి ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.
ఫిదా సక్సెస్ లో సాయి పల్లవి పాత్ర ఎంతగానో ఉంది. అలా టాలీవుడ్ లో అడుగుపెట్టిన కొత్తల్లో సాయి పల్లవిని ఓ టాలీవుడ్ డైరెక్టర్ తప్పుగా అంచనా వేశాడట. నీకు ఆఫర్ ఇస్తాను కమిట్మెంట్ ఇస్తావా? అని డైరెక్ట్ గా అడిగాడట. సాయి పల్లవి ఫైర్ కావడంతో షాక్ అయ్యాడట. సాయి పల్లవి లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించడంతో సారీ చెప్పాడట. గతంలో ఈ సంఘటన చోటు చేసుకుందంటూ ఓ పుకారు సోషల్ మీడియాలో వినిపిస్తుంది.
అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. తెలుగులో సాయి పల్లవి ఎంసీఏ, శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. సాయి పల్లవి తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలు మాత్రమే ఎంచుకుంటుంది. నెక్స్ట్ ఆమె నాగ చైతన్యకు జంటగా నటిస్తుంది. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల కానుంది.