మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) నివాసంలో నిన్న సాయంత్రం సినీ పెద్దలతో ఒక సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కి నాగార్జునతో పాటు అల్లు అరవింద్, దగ్గుబాటి సూరేశ్ బాబు, దిల్ రాజు, మైత్రి మూవీస్ రవి ప్రసాద్ తదితరులు పాల్గొని సినిమా పరిశ్రమ సమస్యల పై చర్చించారు. మేము సినీ కార్మికులు, థియేటర్ కార్మికుల సమస్యల గురించి అలాగే విద్యుత్ టారిఫ్ వంటి అంశాల పై మాట్లాడాం అని సినీ పెద్దలు లీకులు వదిలారు.
కానీ అసలు వాస్తవం.. ఏపీలో జగన్ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఎలా ముందుకు పోవాలి, బీ.సీ సెంటర్లలో టికెట్ రేట్లును పెంచుకునే విధంగా జగన్ ను ఎలా ఒప్పించాలి వంటి విషయాల పై సినీ పెద్దలు చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిరంజీవికి అపాయింట్‌మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
జగన్ ను కలిసే సమయంలో మెగాస్టార్ తో పాటు మిగిలిన సినీ పెద్దలు కూడా వెళ్లనున్నారు. అయితే జగన్ ప్రభుత్వం మొదటి నుండి థియేటర్ల విషయంలో అలాగే టికెట్ రేట్లు విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో సినిమా టికెట్ రేట్లు పెంచబోయేది లేదని ఇప్పటికే జగన్ ప్రభుత్వం నుండి వచ్చిన సమాచారం.
మరి ఇప్పుడు సినీ పెద్దలు వెళ్లి కలిసి రిక్వెస్ట్ చేస్తే.. కొంతవరకు జగన్ మనసు మారొచ్చు. కాకపోతే.. సినీ పెద్దలు కోరుకున్న స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు పెరగవు. అదే బెల్ట్ షాప్ ల విషయంలో అయితే, జగన్ కు ఎలాంటి కండిషన్ లు ఉండవు. విచ్చలవిడిగా రేట్లు పెంచొచ్చు, అలాగే అనుమతులు ఇవ్వొచ్చు, ఇలా చేస్తే బోలెడు ఆదాయం. అదే థియేటర్ల విషయంలో ప్రభుత్వానికి పెద్దగా వచ్చేది ఏమిలేదు కదా, మరి జగన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.