https://oktelugu.com/

ఓటీటీలో టాలీవుడ్ సందడి షురూ!

కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లు మూతపడిన సంగతి తెల్సిందే. గత ఆరునెలలు థియేటర్లు తెరుచుకోకపోవడంతో కొత్త సినిమాలేవి రిలీజు నోచుకోవడం లేదు. థియేటర్ల ఓపెనింగ్ నేటికి స్పష్టత రాకపోవడంతో సినిమాలు నిర్మాతలు ఆలోచనలో పడుతున్నారు. ఇప్పటికే సినిమా పూర్తి చేసుకొని థియేటర్లలో రిలీజుగా రెడీగా ఉన్న సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. Also Read: డ్రగ్స్ ఆరోపణల పై నవదీప్ సెటైర్ ! సినిమా థియేటర్లు మూతపడటంతో ప్రేక్షకులంతా ఓటీటీలకు అలవాటుపడిపోతున్నారు. ఓటీటీల్లో సినిమాలను చూసేందుకు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 16, 2020 / 12:57 PM IST

    Tollywood in ott

    Follow us on

    కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లు మూతపడిన సంగతి తెల్సిందే. గత ఆరునెలలు థియేటర్లు తెరుచుకోకపోవడంతో కొత్త సినిమాలేవి రిలీజు నోచుకోవడం లేదు. థియేటర్ల ఓపెనింగ్ నేటికి స్పష్టత రాకపోవడంతో సినిమాలు నిర్మాతలు ఆలోచనలో పడుతున్నారు. ఇప్పటికే సినిమా పూర్తి చేసుకొని థియేటర్లలో రిలీజుగా రెడీగా ఉన్న సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేసేందుకు మొగ్గుచూపుతున్నారు.

    Also Read: డ్రగ్స్ ఆరోపణల పై నవదీప్ సెటైర్ !

    సినిమా థియేటర్లు మూతపడటంతో ప్రేక్షకులంతా ఓటీటీలకు అలవాటుపడిపోతున్నారు. ఓటీటీల్లో సినిమాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా కొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకే మొగ్గుచూపుతున్నారు. బాలీవుడ్, కోలీవుడ్, తమిళం, మలయాళ సినిమాలన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. అయితే టాలీవుడ్ నిర్మాతలు మాత్రం ఓటీటీలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. చిన్న సినిమాలన్నీ ఓటీటీల్లో దర్జాగా రిలీజు అవుతూ మంచి లాభాలు ఆర్జిస్తున్నాయి.

    టాలీవుడ్ కు చెందిన పెద్ద సినిమాలేవీ కూడా ఓటీటీల్లో రిలీజ్ కాకపోవడంతో ప్రేక్షకులు కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు. అయితే ఇటీవల హీరో నాని-సుధీర్ బాబులు నటించిన ‘వి’ సినిమా టాలీవుడ్ నుంచి ఓటీటీలో రిలీజైన పెద్ద సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ థియేటర్లలో రిలీజైతే ఖచ్చితంగా నిర్మాత నష్టపోవాల్సి వచ్చేదనే టాక్ విన్పించింది. ఓటీటీలో ‘వి’ రిలీజ్ చేసినందు వల్లే నిర్మాత గట్టెక్కినట్లు ప్రచారం జరిగింది. ‘వి’ చిత్రానికి ఓటీటీలో మంచి ధర పలకడంతో టాలీవుడ్లో అగ్ర నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

    Also Read: Bigg Boss 4.. అమెరికా అల్లుడిపై అత్త మోజు..!

    రానున్న రెండు నెలల్లో టాలీవుడ్ సినిమాలన్నీ వరుసగా ఓటీటీలో రాబోతున్నాయి. అక్టోబర్ 2న ‘ఒరేయ్ బుజ్జిగా’ ఆహాలో రిలీజ్ కాబోతుంది. దీంతోపాటు అక్టోబర్ 23న దసరాగా కానునగా ‘కలర్ ఫొటో’ రాబోతుంది. వీటితోపాటు అనుష్క నటించిన ‘నిశబ్ధం’.. సాయిధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్.. మిస్ ఇండియా.. గుడ్ లక్ సఖి.. దటీజ్ మహాలక్ష్మి సినిమాలు అక్టోబర్, నవంబర్ నెలల్లో అలరించబోతున్నాయి. ‘వి’ తర్వాత పెద్ద సినిమాలన్నీ ఓటీటీలో రిలీజ్ అవుతుండటంతో ప్రేక్షకులు కొత్త సినిమాలను చూసేందుకు అత్రుతగా ఎదురు చూస్తున్నారు.