https://oktelugu.com/

Prabhas : ప్రభాస్ ని రే%# చేస్తా… నటి షాకింగ్ కామెంట్స్

ప్రభాస్ గురించి ఒక వర్ధమాన నటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కావాలని చేసిందో లేక ప్రభాస్ మీద అమితమైన ఇష్టం తో చేసిందో కానీ అవి తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి.

Written By:
  • Shiva
  • , Updated On : August 13, 2023 / 04:54 PM IST
    Follow us on

    Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాన్ ఇండియా స్థాయి దాటేసి పాన్ వరల్డ్ స్థాయికి చేరిన నటుడు. ఇక అతనికి ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి లాంటి సినిమాలతో అమ్మాయిల హృదయాలకు దగ్గరయ్యాడు డార్లింగ్ ప్రభాస్. ఇక హీరోయిన్స్ అయితే కనీసం తమ కెరీర్ లో ఒక్కసారైనా ప్రభాస్ తో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తారు.

    ఇలాంటి ప్రభాస్ గురించి ఒక వర్ధమాన నటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కావాలని చేసిందో లేక ప్రభాస్ మీద అమితమైన ఇష్టం తో చేసిందో కానీ అవి తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. ఆ నటి పేరు ఇందు. ఇప్పటికి ఆమె సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో మాత్రమే రాణిస్తోంది. అయితే ప్రముఖ దర్శకులతో ఆమెకు పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు వర్మ, తేజ, బుచ్చిబాబు, హరీష్ శంకర్ లాంటి వాళ్లతో ఫోటోలు దిగి వాళ్ళు చాలా క్లోజ్ అన్నట్లు హడావిడి చేస్తుంది.

    ఆమె గతంలో ప్రభాస్ మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ కావటమే కాకుండా వివాదానికి దారితీశాయి. ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమెకు ప్రభాస్ తో చెల్లిగా నటించాల్సి వస్తే ఆ పాత్ర కి ఒకే చెబుతారా అనే ప్రశ్న ఎదురుకావడంతో.. సినిమాల్లో అయితే ఓకే.. చెల్లిగా నటిస్తా. కానీ ఆఫ్ స్క్రీన్ లో మాత్రం ప్రభాస్ ని రేప్ చేయాలని ఉంది. అంత ఇష్టం అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది.

    దీంతో ఆమెను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు, ఇదే సమాధానం ఎవరైనా హీరో ఒక హీరోయిన్ ని ఉద్దేశించి చెపితే మహిళా సంఘాలు ఇలాగే మౌనంగా ఉంటాయా ? అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో ఒక సినిమా కి సంధించిన విషయాలు గురించి సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ అప్పుడు నా పరిస్థితి రేప్ కు గురైన అమ్మాయిల మారిందని అన్నాడు.. దీనిని జాతీయ స్థాయిలో వివాదం చేశారు. మహిళా సంఘాల అరచి గోల గోల చేశాయి. అందులో సల్మాన్ ఎక్కడ కూడా ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడలేదు. కానీ దాన్ని ఎంత పెద్ద వివాదం చేయాలో అంత వివాదం చేశారు. మరి ఇప్పుడు ఇందు చేసిన వ్యాఖ్యల గురించి ఈ మహిళా సంఘాలు ఎలా సమర్ధించుకుంటాయి అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.