Srikanth Bharat Comments On Mahatma Gandhi: మంచి నటుడు అయితే సరిపోదు, సినీ ఇండస్ట్రీ లో ఉన్నప్పుడు ప్రవర్తన తో పాటు,నోరు కూడా అదుపులో పెట్టుకోవాలి. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే తీవ్రమైన పరిణామాలు తప్పవు. ఇప్పుడు ప్రముఖ నటుడు శ్రీ భరత్(Sri Bharat) అలియాస్ శ్రీకాంత్ అయ్యంగార్ పరిస్థితి అలాగే తయారైంది. నటుడిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ వచ్చిన ఈయన, రీసెంట్ గా విడుదలైన పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ‘ఓజీ’ చిత్రం లో కూడా నటించాడు. రీసెంట్ గా ఆయన ప్రధాన పాత్ర పోషించి అరి అనే చిత్రం విడుదలైంది. చిన్న బడ్జెట్ తో, నోటెడ్ నటీనటులతో మంచి కాన్సెప్ట్ తోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కానీ ఇందులో శ్రీ భారత్ ఉన్నాడు అనే విషయాన్నీ తెలుసుకొని, ఈ చిత్రాన్ని బ్యాన్ చేస్తామంటూ గాంధీ ఫాలోయర్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
గాంధీ జయంతి సందర్భంగా శ్రీ భరత్ గాంధీ పై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. మళ్లీ దానికి వివరణ ఇస్తూ, గాంధీ ని ఇంకా అడ్డమైన బూతులు తిడుతూ ఇంకో వీడియో ని విడుదల చేసాడు శ్రీ భరత్. ఇది ఇంకా బాగా వైరల్ అయ్యింది. గాంధీ ని అభిమానించని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మన జీవ నాడి డబ్బు. అది లేకపోతే ఏ పని జరగదు, అలాంటి డబ్బు పై గాంధీ బొమ్మ ఉంటుంది. అలాంటి మోహోన్నత వ్యక్తి పై కామెంట్స్ చేస్తే ఎవరు ఊరుకుంటారు ?, అందుకే చిన్న సినిమా అయినటువంటి ‘అరి’ కి ఇప్పుడు శ్రీ భరత్ చేసిన కామెంట్స్ తాలూకు వేడి తగిలింది. నిన్న ఈ సినిమా ప్రదర్శితమవుతున్న ఒక థియేటర్ కి గాంధీ ఫాలోయర్స్ వెళ్లి ధర్నా చేస్తూ, శ్రీకాంత్ నటించిన సినిమాలను భారత దేశం లో ఎక్కడా కూడా ఆడనివ్వం, ఆయన్ని ఇండస్ట్రీ నుండి తక్షణమే బ్యాన్ చెయ్యాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. దీంతో సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది, బాగా ఆడుతుంది అని ఆశించిన మేకర్స్ ఇప్పుడు శ్రీ భరత్ కామెంట్స్ తాలూకు వేడిని చూసి భయపడుతున్నారు. చూడాలి మరి ఈ వ్యవహారం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.