Bigg Boss 9 Telugu Sreeja Elimination: బిగ్ బాస్ హిస్టరీ లోనే అన్యాయమైన ఎలిమినేషన్ కి నేడు రాత్రి ప్రసారం అవ్వబోయే ఎపిసోడ్(Bigg Boss 9 Telugu) వేదిక గా మారనుంది. హౌస్ లో టాస్కులు అద్భుతంగా ఆడుతూ, ప్రతీ చిన్న విషయం తన స్టాండ్ ని తీసుకొని, తన వాయిస్ ని రైజ్ చేస్తూ మాట్లాడే దమ్ము శ్రీజ ని ఎలిమినేట్ చేశారని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఎంత అన్యాయం అంటే, ఈ వారం అతి తక్కువ ఓట్లు వచ్చిన డిమోన్ పవన్, రీతూ చౌదరి లను ఎలిమినేట్ చేయకుండా, స్క్రిప్ట్ ప్రకారం రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ డేంజర్ జోన్ లో ఉన్నట్టు చూపించి, ఇమ్మానుయేల్ చేతుల్లో పవర్ అస్త్రా ని పెట్టారు. ఆయన చేతిలోకి అలాంటి పవర్ వస్తే కచ్చితంగా రీతూ చౌదరి ని సేవ్ చేస్తాడని మన అందరూ ఊహించాము. ఊహకు తగ్గట్టే ఆయన రీతూ చౌదరి ని సేవ్ చేసాడు, ఫ్లోరా ఎలిమినేట్ అయిపోయింది.
ఫ్లోరా నుండి ఎలాగో ఎలాంటి కంటెంట్ రావడం లేదు కాబట్టి ,ఆమెని బలవంతంగా పంపేశారు, పోనిలే ఇక్కడితో ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యిందని అంతా అనుకున్నారు. కానీ ఫైర్ స్ట్రోమ్ లాగా హౌస్ లోకి అడుగుపెట్టిన వైల్డ్ కార్డ్స్ కి బిగ్ బాస్ టీం ఒక పవర్ ఇచ్చింది. గత వారం లో జరిగిన ఇమ్మ్యూనిటీ టాస్కులలో దమ్ము శ్రీజ, సుమన్ శెట్టి టీం అందరికంటే తక్కువ పాయింట్స్ ని తెచ్చుకున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యత ని మీకు అప్పగిస్తున్నామని నాగార్జున వీళ్లిద్దరి తలరాతను వైల్డ్ కార్డ్స్ చేతుల్లో పెట్టారు. నాలుగు ఓట్లు శ్రీజ ఎలిమినేషన్ కోసం పడ్డాయి, రెండు ఓట్లు సుమన్ శెట్టి ఎలిమినేషన్ కోసం పడ్డాయి. దీంతో సుమన్ శెట్టి సేవ్ అయ్యాడు, శ్రీజ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది.
ఇక్కడ అర్థం కానిది ఏమిటంటే, బయట నుండి అందరి ఆటని చూసి వచ్చిన వైల్డ్ కార్డ్స్ సుమన్ శెట్టి బాగా ఆడుతున్నాడో?, లేకపోతే దమ్ము శ్రీజ బాగా ఆడుతుందో అర్థం అవ్వలేదా?, అలా అన్యాయంగా ఆమెని ఎలిమినేట్ చెయ్యాలని ఎలా అనిపించింది?, ఇది వాళ్లకు చాలా నెగిటివ్ అవుతుందని ఊహించలేకపోయారా?, ఇంత తెలివి తక్కువ నిర్ణయం వైల్డ్ కార్డ్స్ ఎలా తీసుకున్నారు అనేది అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా చాలా మంది విశ్లేషకులు శ్రీజ ని నిజంగా ఎలిమినేట్ చేసి ఉండరు, ఆమెని కచ్చితంగా సీక్రెట్ రూమ్ లో పెట్టి ఉంటారు, ఆమెది ఒక ఫేక్ ఎలిమినేషన్ అని కూడా అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఇది ఫేక్ ఎలిమినేషన్ అవ్వాలనే ఆశిద్దాం, లేదంటే ఈ సీజన్ తీవ్రమైన నెగిటివిటీ ని ఎదురుకోవాల్సి వస్తుంది.