OKTelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ‘విరాటపర్వం’ సినిమాతో తనదైన ముద్ర వేసుకున్నాడు దర్శకుడు వేణు. ఆయన సినిమాలు కథనంలో ఆసక్తి .. సహజత్వానికి పెద్దపీట ఉండటంతో ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అవుతున్నాయి. అయితే ఆయన దగ్గర నుంచి కథలను తీసుకుని.. ఏవి సినిమాలకి పనికొస్తాయి? ఏవి వెబ్ సిరీస్ లు చేసుకోవచ్చు? అనేవి అల్లు అరవింద్ టీమ్ పరిశీలన చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇక తన తరువాత సినిమా ఏమిటనేది వేణు త్వరలో ప్రకటించనున్నాడు.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. మంచు లక్ష్మిని సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్లు. వివరాల్లోకితే.. బోనాల పండుగను పురస్కరించుకుని.. మంచు లక్ష్మి తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఒక ఫోటోను షేర్ చేసింది. అయితే ఆ ఫోటోలో బోనాల విషెస్ చెబుతూ.. లక్ష్మి బతుకమ్మ ఎత్తుకున్న ఫోటో పెట్టింది. దింతో నెటిజెన్లు బతుకమ్మకు.. బోనాలకు తేడా తెలీదా అంటూ.. తెగ ట్రోల్ చేస్తున్నారు.
అలాగే మరో అప్ డేట్ విషయానికి వస్తే.. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుశ్ నటించిన చిత్రం “సార్”. తమిళంలో ఈ సినిమాకి “వాతి” అనే టైటిల్ ఖరారు చేశారు. సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సాయికుమార్ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. అయితే, ఈ సినిమా నుంచి ఈ నెల 27న ఫస్టులుక్.. 28న టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. పి.వాసు డైరెక్షన్‌లో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చంద్రముఖి2 మూవీలో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే ఓ హీరోయిన్‌గా నంబియార్‌ను ఎంపిక చేయగా, మిగతా వారి కోసం సెర్చ్ చేస్తున్నారట. 2005లో రజినీకాంత్ హీరోగా రూపొందిన చంద్రముఖి ఘన విజయం సాధించింది. 17 ఏళ్ల తర్వాత సీక్వెల్ రూపొందుతుండటంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.