Samantha: అది కూడా కంప్లీట్… సమంత నెక్స్ట్ స్టెప్?

ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ పూర్తి చేయాల్సి ఉండగా ఈ ఏడాది ప్రారంభంలో సమంత బయటకు వచ్చారు. వస్తూనే ఆమె సిటాడెల్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ముంబై, కులుమనాలి, సెర్బియాతో పాటు పలు ప్రాంతంలో సిటాడెల్ షూటింగ్ జరిగింది.

Written By: Shiva, Updated On : July 13, 2023 6:21 pm

Samantha

Follow us on

Samantha: గత ఆరు నెలలుగా సమంత బిజీగా ఉన్నారు. ఏక కాలంలో ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్స్ షూటింగ్స్ లో పాల్గొన్నారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఖుషి షూటింగ్ కి సమంత కారణంగా బ్రేక్ పడింది. యశోద విడుదలకు ముందు సమంత మాయోసైటిస్ బారినడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సమంత అభిమానులను ఈ ప్రకటన కలిచివేసింది. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. చికిత్సలో భాగంగా కొన్ని నెలల పాటు సమంత ఇంటికే పరిమితమయ్యారు.

ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ పూర్తి చేయాల్సి ఉండగా ఈ ఏడాది ప్రారంభంలో సమంత బయటకు వచ్చారు. వస్తూనే ఆమె సిటాడెల్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ముంబై, కులుమనాలి, సెర్బియాతో పాటు పలు ప్రాంతంలో సిటాడెల్ షూటింగ్ జరిగింది. నేడు సిటాడెల్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. జులై 13 నాకు చాలా ప్రత్యేకం. సిటాడెల్ షూటింగ్ కంప్లీట్ చేశానంటూ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో కామెంట్ చేశారు.

ఇటీవల దాక్షారామంలో ఖుషి క్లైమాక్స్ షూట్ చేశారు. విజయ్ దేవరకొండ-సమంత మీద పెళ్లి సన్నివేశాలు చిత్రీకరించారు. దీంతో ఖుషి షూటింగ్ సైతం పూర్తయింది. కాబట్టి సమంత ఇప్పుడు ఫ్రీ. నెక్స్ట్ ఏంటి అనే సందేహాలు మొదలయ్యాయి. కాగా ఇటీవల సమంత ఏడాది పాటు విరామం తీసుకోనున్నారనే ప్రచారం జరిగింది. చికిత్స కోసం అమెరికా పయనమవుతున్న సమంత కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చేయరంటూ కథనాలు వెలువడ్డాయి. కథనాల్లో వాస్తవం ఉంటే సమంత విశ్రాంతి తీసుకోనుంది.

కాగా సమంత ఓ హాలీవుడ్ సినిమాకు సైన్ చేశారని కూడా వినిపించింది. చెన్నై స్టోరీ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ లో వివేక్ కల్రా హీరోగా నటిస్తారని. జాన్ ఫిలిప్ దర్శకుడని కథనాలు వెలువడ్డాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఖుషి సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఇది రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్. ఇక సిటాడెల్ యాక్షన్ వెబ్ సిరీస్. సమంతకు జంటగా వరుణ్ ధావన్ నటించారు. రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. ప్రైమ్ లో సిటాడెల్ స్ట్రీమ్ కానుంది.