Bigg Boss 9 voting last day: ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) మరో రెండు రోజుల్లో ముగియబోతుంది. నాల్గవ సీజన్ తర్వాత అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ ఈ సీజన్ కి మాత్రమే నమోదు అయ్యాయి అట. 7వ సీజన్ సూపర్ హిట్ అయ్యాక, 8వ సీజన్ యావరేజ్ రేంజ్ టీఆర్ఫీ రేటింగ్స్ ని నమోదు చేసుకుంది. ఇక ఈ సీజన్ ప్రారంభం లో నత్త నడకన సాగడం తో డిజాస్టర్ ఫ్లాప్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ బంధాలు, అనుబంధాలు, ఎమోషన్స్ మధ్య ఈ సీజన్ సాగడం తో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో టీఆర్ఫీ రేటింగ్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చాయి. అయితే అన్నీ సీజన్స్ లో లాగా కాకుండా ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా ఎవరు నిలబడబోతున్నారో చెప్పడం చాలా కష్టమైంది .
నిన్న మొన్నటి వరకు టైటిల్ రేస్ తనూజ, కళ్యాణ్ మధ్య మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు కళ్యాణ్, తనూజ మరియు డిమోన్ పవన్ మధ్య టైటిల్ రేస్ జరుగుతుందని, ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు కచ్చితంగా టైటిల్ గెలుస్తారని అంటున్నారు. ఆదివారం రోజున ఎవ్వరూ ఊహించనిది జరగబోతుంది. నిన్నటి వరకు ఓటింగ్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ 29 శాతం ఓటింగ్ తో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్నాడట. ఇక ఆ తర్వాతి స్థానం లో తనూజ 27.5 శాతం ఓటింగ్ తో రెండవ స్థానంలో, డెమోన్ పవన్ 25 శాతం ఓటింగ్ తో మూడవ స్థానం లో కొనసాగుతున్నాడు. చూసారా ముగ్గురి మధ్య ఎంత కఠినమైన పోటీ జరుగుతుందో. ఏ క్షణం లో అయినా నెంబర్ 1 స్థానం మారిపోవచ్చు. కాబట్టి ఈ ముగ్గురి అభిమానులు కూడా మా వాడు ఎలాగో గెలవడు కదా, గెలిచేవాళ్లకు ఓటు వేద్దాం అనుకుంటే పెద్ద పొరపాటే.
ముఖ్యంగా డిమోన్ పవన్ ఫ్యాన్స్ గుర్తు పెట్టుకోవాలి, అతను టైటిల్ రేస్ లో ఉన్నాడు, కచ్చితంగా ట్రోఫీ ని ఎత్తే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది. కాబట్టి మీ అభిమాన కంటెస్టెంట్స్ కి ఓట్లు వేసుకోండి, నేడు రాత్రి 12 గంటలకు ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవ్వబోతున్నాయి. ఇక ఇమ్మానుయేల్ విషయానికి వస్తే ఆయన కేవలం 11 శాతం ఓటింగ్ తో కొనసాగుతున్నాడు . ఇక సంజన గురించి పట్టించుకోవడమే మానేసినట్టు ఉన్నారు జనాలు. బిగ్ బాస్ సీజన్ 9 ని తన ఒంటి చేత్తో పైకి లేపిన సంజన కి కేవలం 6 శాతం ఓటింగ్ మాత్రమే నమోదు అవుతుంది అంటే నమ్ముతారా?, కానీ నిజంగానే అంత తక్కువ ఓటింగ్ పడుతోంది. వాస్తవానికి టీపీపీ 5 లో భరణి ఉండాలి. ఆయనకు మంచి ఓటింగ్ వచ్చినా తొలగించారు అనే రూమర్ ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.