OKTelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ఏప్రిల్ 1 నుంచి ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్లు అమ్మాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. టిక్కెట్ల అమ్మకాల కోసం ప్రభుత్వం టెండర్లు పూర్తి చేసింది. ప్రైవేట్ సంస్థల కంటే తక్కువగా ప్రభుత్వమే నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. అన్ని థియేటర్లు ఒకే సంస్థ ద్వారా టిక్కెట్ల అమ్మకాలు చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ చర్యతో బ్లాక్ టికెట్ల దందాకు చెక్ పెట్టాలని సర్కారు యోచిస్తోంది.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. సరికొత్త కంటెంట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఏకైక తెలుగు ఓటీటీ సంస్థ ఆహా. ఇప్పటికే ఆహా వేదికగా అనేక సినిమాలు సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో భాగంగా సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించడానికి వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ బ్లడీ మేరితో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలో నటించింది. త్వరలోనే బ్లడీ మేరి ఆహాలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Siva karthikeyan: ప్రముఖ నిర్మాత పై కేసు పెట్టిన స్టార్ హీరో.. కారణం అదే

అలాగే మరో అప్ డేట్ విషయానికి వస్తే.. బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్-ఆలియా భట్ జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ఈ చిత్ర పార్ట్ 1 షూటింగ్ పూర్తయింది. దాదాపు ఏడేళ్ల క్రితమే ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్లో అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకుడు. 2022 సెప్టెంబరు 9న.. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం మొదటి భాగం విడుదలకానుంది.

ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. పవన్కల్యాణ్ తన తదుపరి చిత్రం ‘హరిహర వీరమల్లు’ బ్యాలెన్స్ షూట్ కోసం సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ ప్రారంభంకానుంది. దీనికోసం కొన్ని భారీ సెట్లను తీర్చిదిద్దుతున్నారు. లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ తోట థరణి ఆధ్వర్యంలో ఈ సెట్స్ నిర్మాణం జరుగుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ట్వీట్ చేసింది. పవన్, తోటథరణి కలిసి ముచ్చటిస్తున్న ఫొటోను పోస్ట్ చేసింది.
[…] […]