OkTelugu Movie Time: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. మెగాస్టార్ గురించి క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. ‘ఇంద్ర’ సేనారెడ్డిగా అలరించిన చిరు.. చాలా కాలం తర్వాత మళ్లీ సీమ నేపథ్యంలో ఓ కథని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో.. చిరు హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా సీమ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఫ్యాక్షన్ చుట్టూ కథ సాగినా.. ‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాలలో వినోదం పండించిన.. వెంకీ కుడుముల.. చిరు కోసం అలాంటి కథనే రాస్తున్నారని తెలుస్తోంది.

మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ విషయానికి వస్తే.. మోహన్ బాబు గొప్ప నటుడే. కానీ తనకు తానే ఇండస్ట్రీకి పెద్ద అన్నట్టు నడుచుకుంటుంటాడు. ఈ విచిత్ర ధోరణే సన్ ఆఫ్ ఇండియా ఘోర పరాభవానికి కారణం అంటున్నారు సినీ విశ్లేషకులు. తరచూ తనని ఎవరో టార్గెట్ చేస్తున్నారంటాడు, కానీ అక్కడ ఎవరూ ఉండరు. నేడు ట్రోలర్స్‌పై కూడా కేసు వేశాడు. రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. సమాజంలో ఒక వ్యక్తిని తప్పు పట్టొచ్చు, కానీ జనమంతా తప్పంటే ఎలా? అంటున్నారు విశ్లేషకులు.

ఇక మరో అప్ డేట్ ఏమిటంటే..హైదరాబాద్‌లో త్వరలో తొలి డ్రైవ్ ఇన్ థియేటర్ ఏర్పాటు కానుంది. ఇటీవల హెచ్‌ఎండీఏ అధికారులతో జరిగిన సమావేశంలో ఓఆర్‌ఆర్‌కు సమీపంలో డ్రైవ్ ఇన్ థియేటర్ కోసం తగిన స్థలం గుర్తించమని మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ‘భీమ్లానాయకే’.. కానీ నిరాశలో ఫ్యాన్స్ !

కాగా డ్రైవ్ ఇన్ థియేటర్‌కు 150 ఎకరాల స్థలం అవసరమవుతుంది. థియేటర్ అందుబాటులోకి వస్తే పెద్ద స్క్రీన్ ఎదుట పార్క్ చేసిన కారులో కూర్చుని సినిమాను ఆస్వాదించవచ్చు.
Also Read: భీమ్లా నాయక్ ట్రైలర్ సునామీ.. రికార్డులు చెరిపేస్తూ ఊచకోత
Recommended Video: