spot_img
Homeఎంటర్టైన్మెంట్Heart Attack: హార్ట్ ఎటాక్ ను అడ్డుకోవాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి..

Heart Attack: హార్ట్ ఎటాక్ ను అడ్డుకోవాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి..

Heart Attack: మానవ శరీరానికి గుండె ఎంత ప్రధానమో అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రతి అవయం హార్టు తోనే లింక్ అయి ఉంటుంది. మనం చేసే ప్రతి ఆరోగ్యకరమైన పని ఇది గమనిస్తూ ఉంటుంది. అంతేకాకుండా గుండె ద్వారానే ఇతర అవయవాలకు రక్తప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో గుండెను ఎప్పుడు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిని నిర్లక్ష్యంగా చూస్తే ప్రాణాలకే ముప్పు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ధమనుల లోపలి గోడలపై చెడు కొలెస్ట్రాల్ పేరుకు పోతే అవి బ్లాక్ అయిపోయి రక్తప్రసరణలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటి ప్రమాదకర సమస్యలు ఏర్పడతాయి. అయితే సరైన ఆహారపు అలవాట్లు ఏర్పరచుకుంటే ఈ సమస్యలు రాకుండా ఉంటాయి. అవి ఏంటంటే?

ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహార పదార్థాలను తింటున్నారు. ముఖ్యంగా ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకొని శారీరక శ్రమ చేయకపోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకు పోతుంది. దీంతో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయి. అయితే ఇలాంటివారు ప్రతిరోజు ఆహారంలో ఓట్స్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఓర్సులో బీటా గ్లూకాన్ ఫైబర్ మొత్తంలో చేరి కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. ఉదయాన్నే వీటిని తీసుకోవడం చాలా మంచిది.

అల్లం లేదా దాల్చిన చెక్క వంటి పదార్థాలను ఇతర ఆహార పదార్థాలలో కలిపి తీసుకోవడం ఎంతో మంచిది. అల్లం లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తాయి. దాల్చిన చెక్కల కొలెస్ట్రాల్, షుగర్ స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. వీటితోపాటు మిరియాల్లో ఫైపరిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది కూడా చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. అందువల్ల కొన్ని రకాల పదార్థాలలో ఇవి ఉండేలా చూసుకోవాలి.

సాధారణంగా ప్రతిరోజు ఏదో ఒక కర్రీతో ఆహారం తీసుకుంటూ ఉంటాం. కానీ టమాటా కర్రీ అప్పుడప్పుడు చూసుకోవడం వల్ల గుండెకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. టమాటాల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ముప్పులు తగ్గిస్తాయి. అలాగే క్యాబేజీ, బ్రోకలీ వంటి కూరగాయల్లో కూడా ఫైబర్, విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తాయి. ఇవి తీసుకుంటే గుండెకు సంబంధించిన వ్యాధులను తగ్గిస్తాయి.

మాంసాహార కుటుంబంలో చికెన్, మటన్ కంటే చేపలు చాలా మంచివి అని కొందరు రైతులు సూచిస్తున్నారు. చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల కొలెస్ట్రాల్ పెరగకుండా అడ్డుకుంటాయి. వారానికి కనీసం రెండుసార్లు చేపలు తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు అని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular