
నటసింహం బాలయ్య బాబు సినిమాలకు కథ పవర్ ఫుల్ గా ఉన్నా లేకపోయినా, సినిమా టైటిల్స్ మాత్రం పవర్ ఫుల్ గా ఉంటాయి. ముఖ్యంగా బోయపాటి, బాలయ్య సినిమా అంటే కచ్చితంగా అదిరిపోయే టైటిల్ ఉండాల్సిందే. అయితే ఈ సినిమా టైటిల్ పై ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. అందులో మెయిన్ గా ‘మోనార్క్’ అనే టైటిల్ తో పాటు డేంజర్ అనే టైటిల్ కూడా బాగా వినిపించింది. ఓ దశలో మోనార్క్ టైటిల్ ను ఫైనల్ చేశారని కూడా బాగా వార్తలు వచ్చాయి. ఇక ఆల్ మోస్ట్ ఇదే టైటిల్ ను ఫిక్స్ అనుకునే లోపు కొత్తగా మరో మాస్ టైటిల్ రేసులోకి వచ్చింది. ‘టార్చ్ బెర్రర్’ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఇప్పుడు బాలయ్య- బోయపాటి సినిమాకి పెట్టబోతున్నారట. టార్చ్ బెర్రర్ అనే డైలాగ్ ఎన్టీఆర్ సినిమాలో బాగా పేలింది. బాలయ్యకు కూడా ఈ టైటిల్ బాగా సూట్ అవుతొంది.
Also Read: వకీల్ సాబ్ కి గ్రీన్ సిగ్నల్.. ఫ్యాన్స్ కి ఒరిగేదేమీ లేదు !
కానీ బాలయ్యకు మాత్రం మోనార్క్ టైటిల్ బాగా నచ్చిందట, మన సినిమాకి ఈ టైటిల్ నే పెడదాం అని బాలయ్య అంటుంటే.. లేదు బాబు టార్చ్ బెర్రర్ టైటిల్ నే కథకు బాగా సూట్ అవుతుంది అంటూ బోయపాటి బాలయ్యను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే బాలయ్య మాత్రం తన సినిమాకి మోనార్క్ నే బాగుంటుంది అంటున్నాడు. కథకు ‘టార్చ్ బెర్రర్’ టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోయినా.. మోనార్క్ అనే టైటిల్ లోనే మనకు మంచి చేసే నంబర్స్ ఉన్నాయని బాలయ్య చెబుతున్నాడట. కానీ బోయపాటి మాత్రం తప్పనిసరిగా ఈ సినిమాకు టార్చ్ బెర్రర్ అనే టైటిల్ నే పెట్టడానికి రెడీగా ఉన్నాడు. ఆల్ మోస్ట్ ఇక ఇదే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నాడట. దసరాకి ఈ సినిమా టైటిల్ ఫ్రీ లుక్ పోస్టర్ ను కూడా అధికారికంగా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. అప్పుడు క్లారిటీ వస్తోంది ఏ టైటిల్ పెట్టారు అనేది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త హీరోయిన్ నటిస్తోంది.
Also Read: డ్రగ్ కేసులో ప్రభాస్ ‘కటౌట్’ ను వాడేస్తున్నారు..!
మరి ఆ హీరోయిన్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ లో బాలయ్య ఎప్పటిలాగే, రొటీన్ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పి చివర్లో ఓ వార్నింగ్ కూడా ఇచ్చారు. పైగా బాలయ్య ఫుల్ యాక్షన్ తో అభిమానులను ఫుల్ గా అలరించాడు. టీజర్ చూశాక, ఎప్పటిలాగే ఈ సినిమా కూడా ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామాతో తెరకెక్కబోతుందని అర్ధమవుతుంది. అసలు బాలయ్య – బోయపాటి కలయిక అంటేనే.. అది ఖచ్చితత్వంతో కూడుకున్న పూర్తి యాక్షన్ డ్రామా అని ఆడియన్స్ కూడా మెంటల్ గా ఫిక్స్ ఆయిపోయారు.