https://oktelugu.com/

Khiladi Movie: మాస్ మహారాజ్ “ఖిలాడి” నుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన మూవీ టీమ్…

Khiladi Movie: మాస్‌ మహారాజ్‌ రవితేజ… ఈ ఏడాది ఫుల్ ఫామ్ లో ఉన్నాడని చెప్పాలి. ఈ ఏడాది  ‘క్రాక్’ మూవీతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ… వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం “ఖిలాడి”. యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ కధాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని… ఏ స్టూడియోస్‌ ఎల్‌ ఎల్పీ పతాకం పై సత్య నారాయణ, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా మీనాక్షి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 4, 2021 / 01:56 PM IST
    Follow us on

    Khiladi Movie: మాస్‌ మహారాజ్‌ రవితేజ… ఈ ఏడాది ఫుల్ ఫామ్ లో ఉన్నాడని చెప్పాలి. ఈ ఏడాది  ‘క్రాక్’ మూవీతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ… వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం “ఖిలాడి”. యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ కధాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని… ఏ స్టూడియోస్‌ ఎల్‌ ఎల్పీ పతాకం పై సత్య నారాయణ, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ స్వరాలను సమకూరుస్తున్నారు. అయితే తాజాగా దీపావళి కానుకగా ఈ మూవీ నుంచి రవి తేజ అభిమానులకు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ను ఇచ్చింది మూవీ టీమ్.

    తాజాగా ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ ను చిత్రా బృందం విడుదల చేసింది. దేవి శ్రీ ప్రసాద్ తన మార్క్ స్టైల్లో ఈ సాంగ్ ను రూపొందించారు. లిరిక్స్ కూడా ఈ చిత్రంలో రవితేజ పాత్ర స్వభావాన్ని వివరించేలా ఉన్నాయి. విలాసవంతమైన సెట్‌ లు, విదేశీ లొకేషన్స్‌ లో చిత్రీ కరించిన ఈ సాంగ్‌ లో విజువల్స్‌ మాత్రమే కాకుండా రవితేజ ఎనర్జిటిక్‌ మూవ్స్‌ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. యశ్వంత్‌ మాస్టర్ తన కొరియోగ్రఫీతో మరోసారి మ్యాజిక్ చేశాడని చెప్పాలి. ఈ చిత్రంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, ముకుందన్‌, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

    ఇక రవితేజ సినిమాల విషయానికి వస్తే ఈ సినిమాతో పాటు రామారావు ఆన్ డ్యూటి, ధమాకా, చిత్రాలలో నటిస్తున్నారు. మరో వైపు సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు రవి తేజ. అలానే నిన్న టైగర్ నాగేశ్వరరావు అనే కొత్త చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించారు.