
Titanic Re-Release : ఈ మధ్య కాలంలో రీరిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ సృష్టించిన కొన్ని సినిమాలను లేటెస్ట్ టెక్నాలజీలోకి మార్చి సరికొత్త అనుభూతిని కలిగించే డీటీఎస్ డాల్బీ అట్మాస్ సౌండ్ తో విడుదల చేస్తున్నారు. ఇది మన తెలుగులో చాలా కామన్ అయిపోయింది. కానీ ఈ ట్రెండ్ ని ఇప్పుడు హాలీవుడ్ కూడా చాలాబలంగా ఫాలో అయిపోతోంది. గత ఏడాది అవతార్ పార్ట్-1ని ఇలాగే రీ రిలీజ్ చేసారు. రెస్పాన్స్ అదిరిపోయింది.
ఈ ఏడాది అదే జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఆల్ టైం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ‘టైటానిక్’ ని ఈమధ్యనే రీ రిలీజ్ చేసారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎవ్వరూ ఊహించని అద్భుతం ని సృష్టించింది. బహుశా జేమ్స్ కెమరూన్ కూడా ఈ చిత్రానికి ఇంత వసూళ్లు వస్తాయని ఊహించి ఉండదు.
ఫిబ్రవరి 10వ తారీఖున విడుదలైన ఈ సినిమా సుమారుగా మొదటి వీకెండ్ లో 22 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం ‘అవతార్ : ది వే ఆఫ్ వాటర్’ థియేటర్స్ లో ప్రస్తుతం రన్ అవుతూనే ఉంది.ఈ సినిమా ప్రస్తుతం నడుస్తున్న వీకెండ్ లో సుమారుగా 20 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టింది.కానీ ‘టైటానిక్’ చిత్రానికి 22 మిలియన్ డాలర్లు రావడం ఆశ్చర్యార్ధకం.
ప్రస్తుతం నడుస్తున్న సినిమా కంటే పాతికేళ్ల క్రితం విడుదలైన చిత్రానికి ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయంటే ప్రేక్షకులకు ఈ సినిమా అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.ఈ చిత్రం లోని సన్నివేశాలను ఇప్పుడు చూసిన ఎదో కొత్త తరహా అనుభూతి కలుగుతుంది.ఆ రేంజ్ మ్యాజిక్ ని జేమ్స్ కెమరూన్ కూడా మళ్ళీ క్రియేట్ చెయ్యలేకపోయాడంటే టైటానిక్ ఎలాంటి అద్భుతం అనేది అర్థం చేసుకోవచ్చు.