Homeఎంటర్టైన్మెంట్Tillu Cube: ఆ క్రేజీ డైరెక్టర్ చేతిలోకి టిల్లు క్యూబ్... సిద్దు జొన్నలగడ్డ వీర విహారం...

Tillu Cube: ఆ క్రేజీ డైరెక్టర్ చేతిలోకి టిల్లు క్యూబ్… సిద్దు జొన్నలగడ్డ వీర విహారం మరో రేంజ్ లో!

Tillu Cube: సిద్దు జొన్నలగడ్డ ఫేట్ మార్చేసిన పాత్ర టిల్లు. ఒక్కసారిగా యూత్ లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సిద్ధూ జొన్నలగడ్డ రాబట్టాడు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలు బాక్సాఫీస్ షేక్ చేయగా.. ఈసారి టిల్లు క్యూబ్ అంటూ వచ్చేస్తున్నాడు. టిల్లు క్యూబ్ కి దర్శకుడిగా ఓ క్రేజీ నేమ్ తెరపైకి వచ్చింది.

Also Read: సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ కోసం ఆ స్టోరీ ని రెడీ చేశారా..? కథ మామూలుగా లేదుగా…

ఒక్క సినిమా ఓవర్ నైట్ స్టార్ చేసేస్తుంది. స్టార్ హోదా తెచ్చిపెడుతుంది. కెరీర్ కి గట్టి పునాది వేస్తుంది. డీజే టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ ఫేట్ మార్చేసింది. సిద్ధు పరిశ్రమకు వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. హీరోగా ఎదిగే క్రమంలో సపోర్టింగ్, విలన్ రోల్స్ చేశాడు. బాయ్స్ మీట్స్ గర్ల్స్, గుంటూరు టాకీస్, కృష్ణ హిస్ లీలా వంటి చిత్రాల్లో హీరోగా నటించాడు. కానీ బ్రేక్ రాలేదు. 2022లో డీజే టిల్లు గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ట్రైలర్, టీజర్ మెప్పించడంతో ఆడియన్స్ లో ఆసక్తి ఏర్పడింది. మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విడుదల చేయడం మరింత ప్లస్ అయ్యింది.

డీజే టిల్లు భారీ హిట్ గా నిలిచింది. క్రైమ్ కామెడీ డ్రామాలో సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. చాలా కొత్తగా హీరో క్యారెక్టరైజేషన్ తీర్చిదిద్దారు. తెలంగాణ యాక్సెంట్ తో సిద్ధు చెప్పే డైలాగ్స్ నవ్వులు పూయించాయి. సిద్ధు తప్ప మరొకరు ఆ పాత్రకు న్యాయం చేయలేరన్న రీతిలో టిల్లు పాత్రను ఆయన పండించారు. టిల్లు రోల్ సిద్ధు జీవితాన్ని మార్చేసింది. ఇక డీజే టిల్లు చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన టిల్లు స్క్వేర్ అంతకు మించిన బ్లాక్ బస్టర్ అందుకుంది. వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

అనుపమ పరమేశ్వరన్ కెరీర్లో ఫస్ట్ టైం బోల్డ్ అండ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేసింది. పార్ట్ 1లో నేహా శెట్టి అదుర్స్ అనిపిస్తే.. ఆమెను అనుపమ బీట్ చేసింది అనడంలో సందేహం లేదు. ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలకు సిద్ధు జొన్నలగడ్డ రచనా సహకారం కూడా ఉంది. మొదటి భాగానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. కారణం తెలియదు కానీ పార్ట్ 2కి దర్శకుడు మారాడు. టిల్లు స్క్వేర్ చిత్రానికి మాలిక్ రామ్ దర్శకత్వం వహించాడు.

ఈ బ్లాక్ బస్టర్ సిరీస్ కి కొనసాగింపుగా టిల్లు క్యూబ్ రానుంది. ప్రకటన కూడా జరిగింది. కాగా మరోసారి దర్శకుడు మారాడు అనేది తాజా సమాచారం. టిల్లు క్యూబ్ మూవీ దర్శకుడిగా కళ్యాణ్ శంకర్ వ్యవహరించనున్నాడట. మ్యాడ్ మూవీతో కళ్యాణ్ శంకర్ మంచి విజయం అందుకున్నాడు. యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్ నిర్మాతలకు లాభాలు పంచింది. మ్యాడ్ సీక్వెల్ మ్యాడ్ 2 విడుదలకు సిద్ధమైంది. మ్యాడ్ 2 టీజర్ ఆకట్టుకుంది. ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంది. ఈ క్రమంలో టిల్లు క్యూబ్ లో సిద్ధు జొన్నలగడ్డ మరింత రెచ్చిపోవడం ఖాయం అంటున్నారు.

Also Read: రాజమౌళి మహేష్ బాబు ను ఆ రేంజ్ లో ఎలివేట్ చేయడానికి కారణం ఏంటి..? ఆయన మామూలోడు కాదురా బాబు…

Exit mobile version