Allu Arjun Atlee Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun), అట్లీ(Atlee) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గురించి సోషల్ మీడియా లో ఏ చిన్న లీక్ వచ్చినా వైరల్ గా మారిపోతోంది. నేషనల్ వైడ్ గా దీని గురించే చర్చించుకుంటూ ఉంటారు. ఆ రేంజ్ క్రేజ్ ఉన్న సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 40 శాతం వరకు పూర్తి అయ్యిందట. ఇప్పుడు తీసిన సన్నివేశాల్లోనే కొన్ని అల్లు అర్జున్ అంచనాలకు చేరకపోవడంతో రీ షూట్స్ చేస్తున్నారు. ఇక హీరోయిన్స్ గా ఈ చిత్రం లో దీపికా పడుకొనే, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి వారు నటిస్తున్నారు. అదే విధంగా హెగెరోయిన్ రష్మిక ఈ చిత్రం లో విలన్ క్యారెక్టర్ చేస్తోంది. ఇప్పటి వరకు దీపికా, అల్లు అర్జున్, అదే విధంగా మృణాల్ ఠాకూర్ అల్లు అర్జున్ కాంబినేషన్స్ పై సన్నివేశాలు చిత్రీకరించారు.
జాన్వీ కపూర్, రష్మిక మందాన ఇంకా షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టలేదు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ కోసం ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్(Tiger Shroff) ని రీసెంట్ గానే సంప్రదించాడట డైరెక్టర్ అట్లీ. టైగర్ కూడా ఇందులో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. టైగర్ ష్రాఫ్ డ్యాన్స్ లో అల్లు అర్జున్ కి ఏ మాత్రం తీసిపోడు. ఇక ఫైట్స్ విషయం లో అయితే అల్లు అర్జున్ ని మించినోడు ఈయన. వీళ్ళ కాంబినేషన్ లో డ్యాన్స్, ఫైట్స్ పడితే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇందులో టైగర్ ష్రాఫ్ పాజిటివ్ క్యారక్టర్ చేస్తున్నాడా?, లేదా నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడా? అనేది ఇంకా బయటకు రాలేదు కానీ, వీళ్ళ కాంబినేషన్ లో మంచి దమ్మున్న సన్నివేశాలు తీస్తే మాత్రం వేరే లెవెల్ లో ఉంటాయని చెప్పొచ్చు. తదుపరి కొత్త షెడ్యూల్ లో టైగర్ ష్రాఫ్ జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇకపోతే ఈ సినిమాకు ఆయన రెమ్యూనరేషన్ దాదాపుగా 30 కోట్ల రూపాయిల వరకు డిమాండ్ చేసాడని సమాచారం. టైగర్ తన ప్రతీ సినిమాకు పాతిక కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ ని అందుకుంటూ వస్తున్నాడు. కానీ ఈ సినిమా కోసం ఆయన 30 కోట్లు డిమాండ్ చేస్తున్నాడంటే, కచ్చితంగా ఎక్కువ స్క్రీన్ టైం ఉన్న పాత్ర నే అని అనిపిస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో ఒక క్యారెక్టర్ నెగిటివ్ గా ఉంటుందట. రెండు ప్రపంచంలో పెరిగిన అన్నదమ్ముల కథ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు అట్లీ. ఇన్ని రోజులు కేవలం కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చిన అట్లీ , ఇప్పుడు ఒక్కసారిగా ఇలా సైన్స్ ఫిక్షన్ జానర్ లో సినిమా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ఎంత వరకు ఆయన సమర్థవతంగా తీస్తున్నాడు అనేది టీజర్, లేదా గ్లింప్స్ వీడియో చూస్తే కానీ ఒక క్లారిటీ రాదు.