Champion Closing Collections: శ్రీకాంత్ కొడుకు రోషన్(Roshan) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఛాంపియన్'(Champion Movie) బాక్స్ ఆఫీస్ వద్ద డివైడ్ టాక్ ని తెచుకున్నప్పటికీ, కమర్షియల్ గా పర్వాలేదు అనే రేంజ్ లోనే ఆడింది. సాధారణంగా ఇలాంటి జానర్ సినిమాలను ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు , టాక్ వస్తేనే ఇలాంటి సినిమాలను థియేటర్స్ కి వెళ్లి చూడరు, అలాంటిది ఇంత డివైడ్ టాక్ వచ్చింది కాబట్టి, కమర్షియల్ గా ఈ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలుస్తుందని విడుదల రోజు అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చాలా డీసెంట్ వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఓపెనింగ్స్ లోనే కాదు, లాంగ్ రన్ లో కూడా ఈ చిత్రం పర్వాలేదు అనిపించింది. వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
ట్రేడ్ పండితులు చెప్తున్నా లెక్కల బట్టీ చూస్తుంటే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. అంటే షేర్ వసూళ్లు దాదాపుగా 9 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 11 కోట్ల రూపాయలకు జరిగింది. అంటే ఫుల్ రన్ లో కేవలం రెండు కోట్ల రూపాయిలు మాత్రమే నష్టం వాటిల్లింది అన్నమాట. కమర్షియల్ గా చూస్తే యావరేజ్ రేంజ్ లో ఆడింది అని చెప్పొచ్చు. రోషన్ మొదటి సినిమా ‘పెళ్లి సందడి’ కి కూడా ఇదే జరిగింది. మొదటి ఆట నుండే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కమర్షియల్ గా మాత్రం సూపర్ హిట్ గా నిల్చింది. రోషన్ నటన, డ్యాన్స్ ని ప్రతీ ఒక్కరు మెచ్చుకున్నారు.
ఇక రెండవ సినిమా కూడా కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో టాక్ లేకపోయినా కూడా ఆడింది అంటే, ఈ కుర్రాడిని ఆడియన్స్ ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. కావల్సినది మంచి సబ్జక్ట్స్ ని ఎంచుకోవడమే. యూత్ ఆడియన్స్ మెచ్చే సినిమాలు చేస్తే రోషన్ రేంజ్ వేరే లెవెల్ కి వెళ్ళిపోతుంది. శ్రీకాంత్ ఎలాగో స్టార్ హీరో అవ్వలేకపోయాడు, కానీ రోషన్ కి స్టార్ హీరో కాదు, ఏకంగా పాన్ ఇండియన్ స్టార్ హీరో అయ్యేంత సత్తా ఉంది. టాలీవుడ్ హృతిక్ రోషన్ అని ఈయన్ని అందరూ పిలుస్తూ ఉంటారు. ఆయన సత్తా కి తగ్గ సినిమాలు భవిష్యత్తులో అయినా చేస్తాడో లేదో చూడాలి.