Tiger Nageswara Rao Collections: మాస్ మహారాజ్ రవితేజ కెరీర్లో భారీ అంచనాలతో విడుదలైంది టైగర్ నాగేశ్వరరావు. 70ల నాటి స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరరావు జీవిత కథగా దర్శకుడు వంశీ తెరకెక్కించాడు. అయితే మొదటి షో నుండి టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ కూడా దెబ్బతిన్నాయి. బాక్సాఫీస్ వద్ద స్ట్రగుల్ అవుతున్న టైగర్ నాగేశ్వరరావు దసరా పండగ దినాలైన సోమ, మంగళవారం మెరుగైన వసూళ్లు రాబట్టింది.
5వ రోజు టైగర్ నాగేశ్వరరావు తెలుగు రాష్ట్రాల్లో రూ.2.70 కోట్ల షేర్ వసూలు చేసింది. అలాగే వరల్డ్ వైడ్ రూ.3.10 కోట్ల షేర్ అందుకుంది. మొత్తం 5 రోజులకు రూ.17.50 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రాబట్టింది. టైగర్ నాగేశ్వరరావు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన నేపథ్యంలో ఇంకా టార్గెట్ చాలా దూరంలో ఉంది.
టైగర్ నాగేశ్వరరావు ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు గమనిస్తే… నైజాంలో రూ.8.60 కోట్లకు అమ్మారు. సీడెడ్ లో రూ.5.40 కోట్లు, ఆంధ్రప్రదేశ్ మిగతా ఏరియాల్లో రూ.17 కోట్ల బిజినెస్ చేసింది. కర్ణాటక రూ. 4 కోట్లు, ఓవర్సీస్ రూ. 3 కోట్లకు అమ్మారు. వరల్డ్ వైడ్ రూ. 37.5 కోట్ల బిజినెస్ చేసింది. అంటే రూ. 39 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగాడు రవితేజ. మరో రూ. 20 కోట్లకు పైగా వసూళ్లు వస్తే కానీ సినిమా బ్రేక్ ఈవెన్ కాదు.
ప్రస్తుత ట్రెండ్ చూస్తే టైగర్ నాగేశ్వరరావు బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే. ఈ చిత్రంలో రవితేజకు జంటగా నుపుర్ సనన్ నటించింది. రేణూ దేశాయ్ రెండు దశాబ్దాల అనంతరం రీఎంట్రీ ఇచ్చింది. ఆమె సామాజిక కార్యకర్తగా ఓ కీలక రోల్ చేశారు. నాజర్, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్ కీలక రోల్స్ చేశారు. జీవి ప్రకాష్ సంగీతం అందించారు.